హైదరాబాద్ లోని దిల్ ఖుష గెస్ట్ హౌజ్.. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. అంతకుముందు కేవలం ఓ గెస్ట్ హౌజ్ లా ఉండే ఈ భవనం.. సీబీఐ తన కార్యాయంగా కొన్నేళ్లుగా వాడుకోవడం వల్ల ఈ కార్యాలయం తరచూ వార్తల్లో ఉండేది. ఇప్పుడంటే అంతలా కాదు గానీ.. జగన్ కేసుల దర్యాప్తు సమయంలో ఐతే.. ఈ గెస్ట్ హౌజ్ ముందు.. మీడియా పడిగాపులు కాస్తూ ఉండేవారు. ఐతే ఇప్పుడు ఇన్నాళ్లూ.... కీలక కేసుల దర్యాప్తునకు కేంద్రంగా నిలిచిన దిల్ ఖుష భవనాన్ని ఖాళీ చేయాలని సీబీఐ నిర్ణయించింది. జనవరి 1వ తేదీ నుంచి మరో చోటకు ఫైళ్లు మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.                                      సత్యం, జగన్, ఎమ్మార్ కేసుల దర్యాప్తు ఎక్కువగా దిల్ ఖుషా నుంచే జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజా ప్రతినిధులు, కీలక వ్యక్తులు వచ్చినప్పుడు అందులో బస చేస్తారు. సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడు...ఆ వ్యవహారాన్ని దర్యాప్తు చేయాలని కేంద్రం ద్వారా సీబీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అనేక మంది సాక్షులు, ఫైళ్లతో ముడిపడి ఉన్నందున విచారణ కోసం కొన్ని సదుపాయాలు సమకూర్చాలని సీబీఐ కోరింది. అప్పడు దిల్ ఖుష భవనంలోని ఓ హాలు, రెండు గదులతో పాటు.. కొన్ని వాహనాలు, స్టేషనరీ ఇతర సదుపాయాలను ఇచ్చింది.                                సత్యం కేసు విచారణ ముగిసినా.. సీబీఐ అధికారులు దిల్ ఖుషాను తమ రెండో కార్యాలయంగా కొనసాగిస్తూ వచ్చారు. సత్యం కేసుకు సంబంధించిన ఫైళ్లన్నీ ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. ఆ తర్వాత జగన్, ఎమ్మార్ కేసుల దర్యాప్తు కూడా సీబీఐ చేపట్టింది. జగన్ తో పాటు పలువురు నిందితుల్ని దిల్ ఖుషాలోనే అరెస్టు చేశారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ గెస్ట్ హౌజ్ ను ఖాళీ చేయమని సీబీఐని కోరింది. దీంతో ఖాళీ చేయకతప్పదని భావించిన సీబీఐ చివరకు కోఠిలోని తన కార్యాలయంలోనే ఈ ఫైళ్లన్నీ ఉంచాలని డిసైడయ్యింది. సో.. ఇక ఫ్యూచర్లో సీబీఐ జగన్ ను మరోసారి విచారించాల్సి వచ్చినా.. దిల్ ఖుషాకు రావాల్సిన అవసరం లేదన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: