భారతీయ జనతా పార్టీకి 2014 రాజకీయంగా చాలా బాగా కలిసి వచ్చిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్-షా అన్నారు. దేశంలో అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ వశం చేసుకుంటోంది. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్-గఢ్, హర్యానా, పంజాబ్, మహారాష్ట్రల్లో బీజేపీ రాజ్యమేలుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ వేవ్.. అమిత్-షా వ్యూహంలో కాంగ్రెస్ రహిత భారత్ దిశగా రాష్ట్రాల్లో పాగా వేస్తోంది బీజేపీ. మొత్తానికి 2014లో బీజేపీ తాను అనుకున్న టార్గెట్-ను దాదాపు చేరుకుందనే చెప్పాలి. ప్రధాన మంత్రి అభ్యర్థిగా సాధారణ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన బీజేపీకి 2014 బాగా కలిసివచ్చింది. ముస్లిం జనాభా అత్యధికంగా కాశ్మీర్-లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 స్థానాలు సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో ఏకంగా 25 స్థానాల్లో విజయం సాధించి రెట్టింపు కంటే స్థానాలు సాధించింది. జార్ఖండ్-లో కూడా స్పష్టమైన మెజార్టీ సాధించడంతో రెండు రాష్ట్రాల్లోనూ అధికారపార్టీలకు ఎదురుదెబ్బ తినిపించింది బీజేపీ. ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన అతికొద్ది కాలంలోనే మహారాష్ట్ర, హర్యానాను ఇటీవలే తన ఖాతాలో వేసుకున్న బీజేపీ ఇప్పుడు విజయోత్సాహంతో ఉరకలేస్తోంది. ఇక బీహార్ తన తదుపరి టార్గెట్ అని చెబుతున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై పూర్తిగా కసరత్తు చేసేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగానే ఇటీవలి కాలంలో తరచూ అమిత్- షా కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటించారు. పశ్చిమబెంగాల్, దక్షిణాది రాష్ట్రాలపై టార్గెట్ చేసిన బీజేపీ ప్రాంతీయ పార్టీలకు చెక్ పెట్టేందుకు భారీ వ్యూహాన్ని ఇప్పటికే సిద్ధం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: