కేబుల్‌ డిజిటైజేషన్‌ పేరుతో ప్రభుత్వం చేస్తున్న హడావిడి ఫలితంగా కేబుల్‌ ఆపరేటర్‌ అస్తిత్వానికే పెనుముప్పు వాటిల్లబోతోంది. ట్రాయ్‌ రూపొందించిన నియమావళి పూర్తిగా కార్పొరేట్‌ ఎమ్మెస్వోలకు, పే చానల్‌ యాజమాన్యాలకు అనుకూలంగా ఉండటంతోబాటు కేబుల్‌ ఆపరేటర్‌ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చాయి. కోట్లకొద్దీ పెట్టుబడులు పెట్టగలిగేవాళ్ళు మాత్రమే రంగంలో మిగిలేలా తయారుచేసిన కేబుల్‌ డిజిటైజేషన్‌ నిబంధనలను వేగంగా అమలు చేయటానికి ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. వ్యాపారాన్ని కాపాడుకోవటానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించుకోవటానికి సైతం ఆపరేటర్లకు అవకాశమివ్వకుండా రెండేళ్ళముందే డిజిటల్‌ ఎమ్మెస్వోగా రిజిస్ట్రేషన్‌ చేసుకునేలా గడువు పెట్టింది. మొదటి రెండు దశల్లో ఎదురైన సమస్యలను పరిష్కరించకుండా, వాటినుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా దూకుడుగా వ్యవహరిస్తోంది. డిజిటైజేషన్‌ మీద సమీక్షించటానికి ఏర్పాటు చేసిన టాస్క్‌ ఫోర్స్‌లో సైతం చిన్న ఆపరేటర్లకు తగిన ప్రాతినిధ్యం కల్పించకపోగా, ఉన్న కొద్దిమంది సైతం సొంత ఖర్చులతో హాజరుకావాలనే నిబంధన విధించి సమావేశాలకు రాకుండా పరోక్షంగా అడ్డుకుంటున్నారు. దేశవ్యాప్తంగా డిజిటైజేషన్‌ మీద అవగాహన కల్పించకుండా నేరుగా ప్రజలమీద భారం మోపుతూ కేబుల్‌ ఆపరేటర్‌ అంతరించి పోయేలా ప్రభుత్వం పథకం పన్నింది. కార్పొరేట్‌ ఎమ్మెస్వోలు, పే చానల్‌ యజమానుల లాబీయింగ్‌ కి లొంగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: