తెలుగు ప్రజల ఉమ్మడి రాజధాని భాగ్యనగరం మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక అవుతోంది. ప్రపంచ ఐటీ కాంగ్రెస్ 2018 లో హైదరాబాద్ లో జరగనుంది. ప్రపంచ ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఐటీ కాంగ్రెస్.. నిర్వహణకు హైదరాబాద్ ఎంపికైంది. ప్రతి రెండేళ్లకోమారు జరిగే ఐటీ కాంగ్రెస్ నిర్వహణకు సహజంగా దేశాల మధ్య టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. యూరప్ కంట్రీస్ ను కాదని.. 2018 కాంగ్రెస్ నిర్వహణ ఛాన్సును ఇండియా దక్కించుకుంది.                                ఇక ఇండియాలో ఈ రేర్ ఛాన్సు అందుకోవాలని.. దేశ రాజధాని దిల్లీతోపాటు బెంగళూరు కూడా చివరివరకూ పోటీపడ్డాయి. ఫైనల్ గా ఈ బ్రహ్మాండమైన అవకాశాన్ని భాగ్యనగరం అందిపుచ్చుకుంది. ఇప్పటివరకూ ఈ కాంగ్రెస్.. ఆసియా ఖండంలో ఒక్కసారి మాత్రమే జరిగింది 2008లో కౌలాలంపూర్ లో జరిగిన ఈ ఐటీ కాంగ్రెస్... దశాబ్దం తర్వాత 2018లో హైదరాబాద్ లో జరగనుంది. 80 నుంచి 90 దేశాలకు చెందిన కార్పొరేట్ అధినేతలు, ఐటీ దిగ్గజాలు, నిపుణులు, అధికారులు, విద్యావేత్తలు ఈ కాంగ్రెస్ లో ఐటీ సంబంధిత అంశాలపై చర్చిస్తారు. ఐటీ విస్తరణ, అభివృద్ధి, ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాలతో పాటు సంబంధిత విధానాలపై చర్చిస్తారు.                                                                                   ఈ వార్తలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాష్ట్రం విడిపోక ముందే.. ఐటీఐఆర్ ప్రాజెక్టులు దక్కించుకున్న హైదరాబాద్.. మరో బ్రహ్మాండమైన అవకాశం దక్కించుకుంటోందని సంతోషించారు. వచ్చే మూడేళ్లలో ఐటీ రంగంలో భారీ విస్తరణకు ప్లాన్ వేస్తున్న కేసీఆర్ కు ఇది చాలా గుడ్ న్యూస్. మొన్నటికి మొన్న గూగుల్ కూడా హైదరాబాద్ లో శాశ్వత కేంద్రం వేసుకోవడం కూడా హైదరాబాద్ కు కలసివచ్చింది. ఐటీ రంగానికి ఒక్కొక్కటిగా వస్తున్న అవకాశాలు బ్రాండ్ హైదరాబాద్ ను మరింతగా పెంచుతాయి. ఈ అవకాశ్ని కేసీఆర్ చక్కగా ఉపయోగించుకుంటే.. ఐటీ రంగంలో హైదరాబాద్ క్రేజ్ కు ఢోకా ఉండదు.

మరింత సమాచారం తెలుసుకోండి: