పాకిస్తాన్ ఏమీ మారలేదు. ఇంకా చెప్పాలంటే గత ఆరు నెలల్లో తన చేష్టలను మరింత తీవ్రం చేసింది. గతంలో భారత సైనికులపై దాడి చేసి వారి తలలు తీసుకెళ్లే దాష్టికాన్నికి తెగబడ్డ పాక్ సైన్యం ఇప్పుడు వరసగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అతిక్రమిస్తోంది. ఆరు నెలల సమయంలో అనేక సార్లు పాక్ ఈ తీరునే వ్యవహరించింది. మరి పాక్ కథ ఇలా ఉంటే..మన ప్రధానమంత్రి మాత్రం పాకిస్తాన్ తో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల పాక్ ప్రధాని నవాజ్ షరీప్ పుట్టిన రోజు సందర్భంగా మోడీ జీ ఆయనకు విషెష్ తెలిపారు. విషెష్ చెప్పడం మాత్రమే కాదు... స్వీట్ బాక్సును కూడా పంపాడు! ఈ పని మోడీ చేశారు కాబట్టి సరిపోయింది. అదే ఆరు నెలల కిందటి వరకూ అధికారంలో ఉండిన కాంగ్రెస్ హయాంలో ఇలాంటి పనులు ఏమైనా జరిగి ఉంటే.. మోడీ రెచ్చిపోయేవారు. ఒకవైపు సరిహద్దులో పాక్ దాష్టికాలకు తెగబడుతుంటే.. భారత ప్రధాని పాక్ ప్రధానికి స్వీట్లు ఇవ్వడం ఏమిటి, శుభాకాంక్షలు తెలపడం ఏమిటి.. అంటూ మోడీ విరుచుకుపడే వారు. అయితే మోడీ మాత్రం సరిహద్దు అంశాల గురించి ఇప్పుడు మాట్లాడటం లేదు. పాక్ అధ్యక్షుడి పుట్టిన రోజును గుర్తు చేసుకొని స్వీట్లు పంపేంత తీరిక మన ప్రభుత్వాధినేతకు.. సరిహద్దులో జరుగుతున్న అంశం గురించి గట్టిగా స్పందించేంత తీరిక గానీ, సైన్యంలో స్ఫూర్తిని నింపే ప్రయత్నం చేయడం గానీ సాధ్యం కావడం లేదు!

మరింత సమాచారం తెలుసుకోండి: