జూబ్లీహాలులో అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు అసెంబ్లీ పరిసరాల్లో అగ్ని మాపక కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు. అగ్ని మాపక శాఖ అధికారులు సోమవారం శాసనసభ కార్యదర్మి డాక్టర్ రాజా సదారాం ఇతర అధికారులతో కేంద్రం ఏర్పాటు విషయమై చర్చించారు. అయితే శాసనసభ పరిసరాల్లో అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసే విషయమై వాస్తవానికి ఏడాది క్రితమే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. కానీ స్థలాభావం, సిబ్బంది వసతుల కల్పన వంటి విషయాల్లో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీనితో కేంద్రం ఏర్పటు కాలేదు. ఆదివారం జరిగిన ప్రమాదం అందరి దృష్టి అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుపై పడింది. ఇక ఎందుకు ఏర్పాటు చేయలేదని ఉన్నతాధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు వీలైనంత త్వరగా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: