ఢిల్లీ పర్యటనలో భాగం గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. రాష్ట్ర పునర్-వ్యవస్థికరణ చట్టంలో పేర్కొన్న హామీలను నెరవేర్చాల్సిన అవసరాన్ని ప్రధానికి విన్నవించారు. ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా.. స్పెషల్ బెనిఫిట్స్ ఇస్తే.. పారిశ్రామికంగా అభివృద్ధి చెండానికి మరింత ఆస్కారం ఉంటుందని... కాబట్టి ఈ ప్రాసెస్ త్వరగా కంప్లీట్ చేయాలని ఆయన ప్రధానిని కోరారు. చంద్రబాబు ప్రస్తావించిన అన్ని అంశాలను ఆలకించిన ప్రధాని మోదీ.. సానుకూలంగానే కన్పించారు. అదే సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంక్రాంతి శుభాకాంక్షలు అందజేశారు. అంతకుముందు చంద్రబాబు కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్ తోనూ, కేంద్ర జలవనరుల శాఖమంత్రి ఉమాభారతి తోనూ భేటీ అయ్యారు. ఉమాభారతితో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, కృష్ణా నదీ జలాలపై చర్చలు జరిపారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ సందర్భంగా ‘ఏ మేకింక్ ఆఫ్ వైజాగ్ స్మార్ట్ సిటీ’ రూపకల్పనపై ఆయన పవర్పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు 

మరింత సమాచారం తెలుసుకోండి: