మేడిన్ ఆంధ్ర అంటే ఎంటో ప్రపంచ దేశాలకు రుచి చూపేందుకు దావోస్ ఆర్థిక సదస్సును వేదిక చేసుకున్నారు చంద్రబాబు. దావోస్‌లో వివిధ పారిశ్రామిక సంస్ధల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్ర ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్ కల్పించే ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సిఇవో డేవిడ్ ఛీజ్ రైట్, విప్రో అధినేతలు అజీమ్ ప్రేమ్‌జీ, రిషద్ ప్రేమ్‌జీ, హీరో మోటోకార్ఫ్ జెఎండి సునీల్ కాంత్ ముంజాల్, పెప్సికో సిఇవో ఇంద్రనూయ తదితర కార్పొరేట్ దిగ్గజాలతో బాబు సమావేశమై పెట్టుబడులతో రాష్ట్రానికి రావాలంటూ ఆహ్వానించారు. హైదరాబాద్, జనవరి 21: మేడిన్ ఆంధ్ర నినాదాన్ని విస్తృతంగా ప్రచారం చేసేందుకు సిఎం చంద్రబాబు దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్ధిక ఫోరాన్ని వేదిక చేసుకున్నారు. వివిధ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో సమావేశమై మేడిన్ ఆంధ్ర ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ కల్పించే ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. బుధవారం ఆయన వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సిఇవో డేవిడ్ ఛీజ్ రైట్‌తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించి విక్రయించేందుకు అంతర్జాతీయ రిటైల్ దిగ్గజం వాల్ మార్ట్ అంగీకరించింది. కొత్త రాష్ట్రంలో మరిన్ని రిటైల్ స్టోర్స్ ఏర్పాటుకు వాల్‌మార్ట్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఏపికి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు కార్పోరేట్ సామాజిక బాధ్యత కింద రాష్ట్భ్రావృద్ధికి చేయూత ఇస్తామని సిఇవో డేవిడ్ రైట్ తెలిపారు. వేరుశఎనగ, జీడిమామిడి, కొబ్బరి, జొన్న, నిమ్మ, మామిడి, పాల ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెటింగ్ కల్పిస్తామన్నారు. స్ధానికంగా చిన్నకారు రైతుల నుంచి వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేసి బ్రాండింగ్ చేసి విక్రయిస్తామన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌ను ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు రైట్ హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: