బెంగాల్ లో పరిస్ధితి దాదా వర్సెస్ దీదీలా మారే ఛాన్స్ ఉంది. ఎందుకంటే…బెంగాల్ టైగర్ మాజీ ఇండియన్ టీం కెప్టెన్ సౌరవ్ గంగూలీ బీజేపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే బీజేపీకి చెందిన సీనియర్ లీడర్లు ఆయనతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే బెంగాల్ స్టేట్ లో అధికార పార్టీకి చెందిన లీడర్లు బీజేపీలో చేరుతున్నారు. అమిత్ షా కూడా ఆపరేషన్ బెంగాల్ స్టార్ట్ చేశారు. బెంగాల్ వస్తాం…అధికారం సాధిస్తాం అని కూడా రెండ్రోజుల క్రితం కామెంట్ చేశారు. దీనిలో భాగంగానే దాదాను బీజేపీలోకి తీసుకువచ్చి ఫ్యూచర్ లో ఎన్నికల్లో పోటీ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే బీజేపీలో గంగూలీ చేరే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: