ఒకప్పుడు రాజకీయ నాయకులంటే ప్రజాసేవలోనే గడిపేవారు.. ఆ తర్వాత రాజకీయం రూటు మారింది. వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి.. రాజకీయవేత్తలు వ్యాపారాల్లోకి వెళ్లారు. ఇప్పుడు రాజకీయ నాయకులు, వ్యాపారులు కలిసిపోయారు. అలాంటి పరిస్థితుల్లో టీడీపీ అధినేత చంద్రబాబు ఓ వ్యాపార సంస్థను దశాబ్దాల తరబడి వివాదాలకు తావులేకుండా నడుపుకుంటూ వస్తున్నారు. గతంలో 9 ఏళ్లపాటు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేసినా.. ఇప్పుడు కొత్త ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నా.. హెరిటేజ్ విషయంలో చిన్నా చితకా ఆరోపణలు మినహా.. ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ విమర్శలు లేవు.

మొదట డైరీతో ఆరంభమైన హెరిటేజ్.. ఆ తర్వాత క్రమంగా విస్తరించడం మొదలు పెట్టింది. తర్వాత హెరిటేజ్ ఫ్రెష్, హెరిటేజ్ ఫుడ్ ప్రోడక్ట్స్.. ఇలా ఉత్పత్తులు పెంచుకుంటూ వస్తోంది. నాణ్యత విషయంలో రాజీపడకపోవడం వల్ల హెరిటేజ్ బ్రాండ్ వాల్యూ పెరిగింది. రేపే మాపో ఈ- కామర్స్ రంగంలోనూ అడుగుపెట్టాలని భావిస్తోంది. మొదట్లో చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి.. ఆ తర్వాత లోకేశ్ హెరిటేజ్ వ్యవహారాలు చూసేవారు. ఇప్పుడు లోకేశ్ రాజకీయాల్లో బిజీకావడంతో నారా బ్రహ్మణి యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ఈడీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఐతే.. కొన్నాళ్లుగా హెరిటేజ్ రిటైల్ వ్యాపారాన్ని అమ్మేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏళ్లతరబడి నష్టాల్లో ఉండటమే అందుకు కారణమని విశ్లేషణలు వచ్చాయి. ఐతే ఈ వార్తలను లేటెస్టుగా నారా బ్రాహ్మణి ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఖండించారు. అమ్మే ఆలోచన ప్రస్తుతానికి లేదని అన్నారు. ప్రస్తుతానికి కాదంటే.. ఆ తర్వాతైనా అమ్మకం ఉంటుందనేనా.. కాకపోవచ్చు.. అమ్మకపోయినా అప్పటి పరిస్థితిని బట్టి.. వ్యూహాత్మక బాగస్వామిని తీసుకోవడం, ప్రత్యేక కంపెనీగా విడదీయడం, పబ్లిక్ ఇష్యూ చేయడం వంటి చర్యలు ఉండొచ్చని బ్రాహ్మణి చెప్పారు.

.

మరింత సమాచారం తెలుసుకోండి: