దేశంలో ఏ భాషలోనూ లేనన్ని న్యూస్ ఛానళ్లు ఏపీలోనే ఉన్నాయ్.. అందుకే రేటింగ్స్ కోసం విపరీతమైన పోటీ.. ఆ పోటీలో నెగ్గేందుకు టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు ఎలాంటి అడ్డదారులైనా తొక్కేందుకు ప్రయత్నిస్తున్నాయ్.. అలా చేసిన ఓ ప్రయత్నమే ఇప్పుడు ఓ టాప్ తెలుగు న్యూస్ ఛానల్ ను ఇబ్బందుల్లో నెట్టేసింది. వారం రోజుల పాటు ఛానల్ మూసుకోవాల్సిన దుస్థితికి కారణమైంది.  ఎన్టీవీ.. తుమ్మల నరేంద్రనాథ్ చౌదరి నిర్వహించే ఈ ఛానల్ తెలుగులోని టాప్ ఫైవ్ ఛానళ్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. నిత్యం ప్రత్యక్ష ప్రసారాలే తన టాగ్ లైన్ గా దూసుకెళ్లింది. ఐతే.. నెంబర్ వన్ స్థానం కోసం కక్కుర్తో.. నైట్ బ్యాండ్ లో రేటింగ్ పెంచుకోవడం కోసమో.. తెలియదు కానీ.. బూతు బొమ్మలు చూసే పబ్లిక్ వీక్ నెస్ ను రేటింగ్ పెంచేందుకు వాడుకుంది. రాత్రి బాగా పొద్దుపోయాక.. సినీకలర్స్ పేరుతో మసాలా పాటల క్లిప్పింగ్స్ ప్రసారం చేసింది. ఓ నాలుగు నెలల పాటు ఈ కార్యక్రమం నడిపించింది.  నిబంధనల ప్రకారం.. టీవీలో ప్రసారం చేయాల్సిన సినీకార్యక్రమాలకు కూడా ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ తెలుగు ఛానళ్లు ఇవేమీ పట్టించుకోవు. రొటీన్ సినిమా క్లిప్పింగ్సయితే పరవాలేదు. అలా కాకుండా.. రేటింగ్ పెంచుకునేందుకు.. సినిమాల్లో లేని హాట్ సీన్స్ కూడా ఇందులో ప్లే చేసేవాళ్లు.. ఎ సర్టిఫికెట్ సినిమాల్లో కూడా అనుమతించని సాఫ్ట్ పోర్న్ క్లిప్పింగ్స్ ప్రసారం చేశారు.  దీన్ని గమనించిన కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ.. ఈ ఎపిసోడ్ పై ఎంక్వయిరీ వేసింది. అందులో నిజం నిగ్గుతేలడంతో.. ఫిబ్రవరి 3 నుంచి ఓ వారం పాటు ఛానల్ పూర్తిగా ఆపేయాలని ఆదేశాలు జారీ చేసింది. మంచి రన్నింగ్ లో ఉన్న టాప్ ఛానెల్ వారం రోజుల పాటు ప్రసారం కాకపోవడం నిజంగా బాధాకరమే. ఛానల్ పరువు ప్రతిష్ట కూడా మంటగలసిపోతాయి. మరి ఎన్టీవీ యాజమాన్యం ఈ విపత్తు ఎలా ఎదుర్కొంటుందో.. కోర్టుకెక్కి.. ఆదేశాలు తాత్కాలికంగా ఆపు చేయిస్తుందా.. వారం పాటు ప్రసారాలు ఆపుతుందా.. చూడాలి.

,

,

,

మరింత సమాచారం తెలుసుకోండి: