కేంద్ర ఆర్థిక మంత్రి పదవిలో అరుణ్ జైట్లీ ఉన్నంత కాలం విదేశాల్లో దాగిఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం విజయవంతం కాదని ప్రముఖ న్యాయవాది, బీజేపీ మాజీ నేత రామ్ జెఠ్మలానీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనను తొలగిస్తేనే ఈ విషయంలో విజయం సాధించవచ్చని తెలిపారు.   తనకు అప్పగించిన పనిని ఎప్పటికీ పూర్తి చేయలేని వ్యక్తికి ప్రధాని మోదీ ఎంతో ముఖ్యమైన పనిని అప్పగించారని, ఒకవేళ నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలని మోదీ నిజంగా భావిస్తే, ఆయనను భర్తరఫ్ చేయాల్సిందేనని జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌ లో రామ్ జెఠ్మలానీ వ్యాఖ్యానించారు. తన జీవితంలోని రెండు ఆశయాల్లో ఒకటైన యూపీఏను గద్దె దించడం నెరవేరిందని అన్నారు. ఇక నల్లధనాన్ని వెనక్కు తేవాలన్న కోరిక మిగిలిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: