యావత్‌ ప్రపంచం నిశితదృష్టి సారించి సోమవారం ఢిల్లీలో జరిగిన గణతంత్రదినోత్సవ వేడుకల పరేడ్‌ను టీవీ న్యూస్‌ ఛానెళ్ళలో గమనిస్తోంది. హఠాత్తుగా ఓ దృశ్యం చూసి నివ్వెరపోయారు ప్రేక్షకులు. ఓ వ్యక్తి చ్యూయింగ్‌ గమ్ తినడం చూసి అవాక్కయ్యారు. తింటే తప్పేముంది? అది సీరియస్‌గా చెప్పుకోదగిన అంశమా? అని ప్రశ్నిస్తే ఔనని సమాధానం చెప్పక తప్పదు. ఆ నిర్వాకానికి పాల్పడింది ఓ సాధారణ వ్యక్తి అయితే టేకిట్‌..ఈజీనే? కానీ, ఆయన ఓ అగ్రరాజ్యానికి రథసారథి. చూయింగ్‌ గమ్ నములుతోన్న ప్రముఖుడు అమెరికా అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా కావడమే చర్చనీ యాంశం. ఆయన అలా చ్యూయింగ్‌ గy్‌ును నమిలే దృశ్యాలు వీడియో, ఫొటో కెమేరాలు చిత్రించాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రసారమయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: