అవినీతి విషయంలో ఎవరినీ సహించం.. అని గాండ్రిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి వారు. వైద్యశాఖలో అవీనీతి ఆరోపణల నేపథ్యంలో మంత్రి రాజయ్యను పదవి నుంచి తొలగించడాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొంటున్నారు టీఆర్ఎస్ వాళ్లు. దీని ద్వారా వారు తమ నేత ఇమేజ్ ను కూడా పెంచేసుకొంటున్నారు!

కేసీఆర్ ను అవినీతి పాలిట సింహస్వప్నంగా అభివర్ణిస్తున్నారు. రాజయ్యను తీసివేయడం ద్వారా కేసీఆర్ ఎన్నో మెట్లు పైకెక్కాడని వారు చెప్పుకొంటున్నారు. ఇకనుంచి వచ్చే నాలుగేళ్ల పాటు కూడా రాజయ్యను తీసివేసిన అంశం తమకు ఉపయోగపడుతుందని తెలంగాణరాష్ట్ర సమితి వాళ్లు భావిస్తుండటం కూడా ఇక్కడ విశేషం.

మరి ఒక్కదెబ్బతో కేసీఆర్ కు అనుకూలంగా మారిన ఈ వ్యవహారాన్ని ఏపీ ముఖ్యమంత్రి కూడా గమనించే ఉంటారు అవినీతి విషయంలో బాబు కోరుకొంటున్నది కూడా ఇదే ఇమేజ్ నే! తను వ్యక్తిగతంగా మిస్టర్ క్లీన్.. తన ఆర్థిక జీవితం అంతా తెరిచిన పుస్తకం అని చెప్పుకొనే బాబు అవినీతి పాలిట సింహస్వప్నం అనే ఇమేజ్ ను కూడా కోరుకొంటున్నాడు.

మరి ఆ ఇమేజ్ కావాలంటే బాబు కూడా కేసీఆర్ లా డేరింగ్ స్టెప్ వేయాల్సి ఉంటుంది. మంత్రులను ఎవరినైనా తప్పించాల్సి ఉంటుంది. ఇది వరకూ అయితే బాబు క్యాబినెట్ లోని ఒకరిద్దరిపై బహుమతులు తీసుకొన్న ఆరోపణలు వినిపించాయి. మరి అలాంటివి రిపీటైతే.. బాబు కూడా కేసీఆర్ ను ఫాలో అయిపోతాడేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: