ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయ రంగం దిక్కుతో చని పరిస్థితుల్లో చిక్కుకుంది. కారణమేదైనప్ప టికీ, మరో దశాబ్ధకాలం గడిచినా సంక్షోభం నుంచి బయటపడుతుందన్న నమ్మకం కలుగ డంలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్ట, నష్టాల నుంచి కర్షకలోకం గట్టెక్కేందుకు మార్గాలెక్కడా కనిపించడంలేదు. గడిచిన ఐదేళ్ళుగా విభజన రాజకీయాల మధ్య నిరాదరణకు గురైన అత్యంత ప్రాధాన్యత గల ఈ రంగం ప్రస్తుతం ఆర్థిక సమ స్యల్లో చిక్కుకుంది. ఉన్న అప్పులు తీరక, కొత్త అప్పులు పుట్టక, వాతావరణం సహకరించక, నానా సమస్యలు ఎదుర్కొంటోంది. పంట పెట్టు బడులకు అవసరమైన నిధులు సమకూర్చుకో లేక అన్నదాతల ఆర్థిక పరిస్థితి దిగజారిన కార ణంగానే సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. అనేక ప్రతి కూల పరిస్థితుల మధ్య ప్రారంభమైన ప్రస్తుత రబీ సీజన్‌లో దాదాపు 2.69 లక్షల హెక్టార్లలో పంటల సాగు తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో అన్ని పంటలు కలిపి సాధారణ విస్తీర్ణం 26.89 లక్షల హెక్టార్లు కాగా, ప్రస్తుత సమయానికి 22.29 లక్షల హెక్టార్లు సాగు కావాల్సి ఉంది. కానీ చిన్న, సన్నకారు రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారినందున ఈ విస్తీర్ణం 19.60 లక్షల హెక్టార్ల వద్ధే స్తంభించింది. రబీ సీజణ్‌ ప్రారంభమై ఇప్పటికే పద్నాలుగు వారాలు గడి చినా పంటల సాగులో ఆశించిన ప్రగతి కని పించడంలేదు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే ఇకపై విస్తీర్ణం పెరుగుతుందన్న నమ్మ కం కలుగడంలేదు.  ఈ రబీ సీజన్‌లో ప్రధానమైన వరి పంట 8.05 లక్షల హెక్టార్లలో సాగవుతుందని వ్యవ సాయశాఖ అధికారులు అంచనా వేశారు. ప్రస్తుత సమయానికి సుమారు 6.38లక్షల హెక్టార్ల విస్తీ ర్ణంలో ఈ పంట సాగు చేయాల్సి ఉంటే 5.76 లక్షల హెక్టార్లు మాత్రమే నమోదైంది. ఇక ఈ పంట సాగుకు ప్రస్తుత వాతావరణం ఏమాత్రం అనుకూలం కాదని, సాగు పెరుగడానికి అవ కాశాలు కూడా తక్కువేనని వ్యవసాయ వాతా వరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ, రాష్ట్ర వ్యవసాయశాఖ అధికారులు మాత్రం విస్తీర్ణం లక్ష్యం దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తు న్నారు. వరితో పాటు గోదుమ, జొన్న, మొక్క జొన్న, రాగులు, సజ్జలు తదితర ముఖ్యమైన ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు, నూనెగిం జల సంబంధిత పంటలు, వాణిజ్య పంటల విస్తీ ర్ణం కూడా తగ్గిపోయింది. 3.13లక్షల హెక్టార్ల పప్పు దినుసుల విస్తీర్ణానికి సాగైంది కేవలం 2.78 లక్షల హెక్టార్లు మాత్రమే. అదేవిధంగా 2.80 లక్షల హెక్టార్ల నూనె గింజల విస్తీర్ణానికి కేవలం 1.30 లక్షల హెక్టార్లు మాత్రమే సాగైంది. వరుస తుపానుల కారణంగా ముగిసిన ఖరీఫ్‌లో సం భవించిన భారీ నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని రబీ రైతాంగం ధైర్యంతో ముందడుగు వేయలేక పోయింది. ఫలితంగానే అన్ని పంటల విస్తీర్ణం తగ్గిపోయింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, ప్రజా జీవనానికి, ముఖ్యంగా కర్షక లోకానికి అత్యంత ప్రాధా న్యమైన వరి, జొన్న, గోధుమ, మొక్కజొన్న, పప్పు దినుసులు, నూనె గింజలు, వాణిజ్య పం టల విస్తీర్ణం గడిచిన మూడేళ్ళుగా తగ్గుతుండ డంతో వ్యవసాయ రంగ నిపుణులు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రబీ సీజన్‌ ముగిసే సమయానికి అన్ని పంటలు కలుపుకొని సాగు కావాల్సిన విస్తీర్ణం 25.89లక్షల హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 19.60 లక్షల హెక్టార్లు సాగై నట్లు ఇటీవల ఏపీ వ్యవసాయశాఖ అధికారులు విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొన్నారు. పంటలు సాగు చేయడానికి నిర్ధేశిత, అనుకూల సమయం దాదాపు 90శాతం ముగిసింది. విత్తు నాటడం మొదలుకొని సస్యరక్షణ చర్యలు, పంట కోతలు, ధాన్యాన్ని విక్రయించడం వరకు అన్ని సందర్భాల్లోనూ అన్నదాతలకు ప్రతికూల పరి స్థితులే ఎదురవుతుండడంతో వారి ఆర్థిక స్థితి గతులు నానాటికీ మందగిస్తున్నాయి. ఈ విష యాన్ని పలు సర్వేలు, అధికారిక నివేదికలు స్పష్టం చేశాయి. గత ఏడాది ప్రస్తుత సమయానికి ఆంధ్రప్ర దేశ్‌ 13 జిల్లాల్లో రబీ పంటల విస్తీర్ణం 20.79 లక్షల హెక్టార్లుగా నమోదైంది. అంతకు ముందు 2013 రబీలో 22.01 లక్షల హెక్టార్లలో పంటలు సాగై నట్లు తెలుస్తోంది ఈ విషయాన్ని సంబంధిత అధి కారులే దృవీకరిస్తున్నారు. ప్రస్తుతం సీజన్‌ సాధా రణ సాగు విస్తీర్ణంలో 76శాతం మాత్రమే పూర ్తయింది. మొత్తం ఆహార ధాన్యాల విస్తీర్ణం 81 శాతం, పప్పుదినుసుల విస్తీర్ణం 82శాతం, నూనె గింజల సంబంధింత పంటల విస్తీర్ణం 56శాతం మాత్రమే నమోదైంది. గడిచిన మూడేళ్ళ సాగు విస్తీర్ణం లెక్కలు పరిశీలిస్తే, ఈసారి పంటల సాగు వెనుకబాబుకు గురైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: