ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ నే చేయకపోయినా.. ఎన్నికల తర్వాత మాత్రం ఒక వెలుగు వెలుగుతున్న నేత వెంకయ్య నాయుడు. అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వెంకయ్యకు మోడీ క్యాబినెట్ పదవి కీలకనేత హోదా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తనదైన దూసుకుపోయే శైలితో వెంకయ్య అవకాశాన్ని సద్వినియోగం చేసుకొన్నాడు. ఇప్పుడు దేశంలోనే ప్రముఖ భారత జనతా పార్టీ నేతగా చెలామణి అవుతున్నాడు.

ఇక ఏపీలో అయితే వెంకయ్య ఇమేజ్ గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టిలో కూడా వెంకయ్య ఒక హీరో. కేంద్రంలో పలుకుబడి కలిగిన నేతగా వెంకయ్యకు ఇప్పుడు ఏపీలో రాచమర్యాదలు దక్కుతున్నాయి. అధికార పార్టీ తరపు ఒక బలీయమైన శక్తి అనే పేరును తెచ్చుకొన్నాడు.

అయితే అంత బలీయమైన శక్తి కి ఇప్పుడు కొత్త కష్టం వచ్చింది. వెంకయ్య తన మీద జనాలు పెట్టుకొన్న అంచనాలను రీచ్ అయితేనే ఆయనపై గౌరవాభిమానాలు మిగులుతాయి. ఆ అంచనాలను రీచ్ కాకపోతే వెంకయ్య పరిస్థితి ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. ఏపీ ప్రజలు వెంకయ్య మీద పెట్టుకొన్న ఆశలు ఏమనగా.. ఆయన ఏపీకి ప్రత్యేక హోదాను ఇప్పిస్తాడు అనేది.

అయితే వెంకయ్య మాత్రం ఇప్పుడు అది కుదిరేపని కాదంటున్నాడు. ఈ విషయంలో ఆయన కాంగ్రెస్ ను నిందించమంటే నిందిస్తాడు కానీ.. తాముగా ఏపీకి ప్రత్యేక హోదా ఇప్పించే పని కుదరదన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మరి ఇంకొన్ని రోజుల్లో ప్రత్యేక హోదా గురించి క్లారిటీ ఇవ్వకపోతే.. వెంకయ్య ఈ విషయంలో చొరవ చూపకపోతే... ఏపీ ప్రజల దృష్టిలో ఆయనొక జీరో అవుతాడేమోనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ విషయంలో వెంకయ్య ఏమనుకొంటున్నాడో!

మరింత సమాచారం తెలుసుకోండి: