ఉచిత విద్యుత్‌ సరఫరా పథకానికి ప్రభుత్వం మంగళం పలకనుంది. వ్యవసాయ విద్యుత్‌ వినియోగంలో పొదుపు చర్య (డిమాండ్‌ సైడ్‌ మేనేజ్‌మెంట్‌-డీఎస్‌ఎం)లను పాటించని రైతులకు సరఫరా చేసే ఈ మేరకు రైతులకు డిస్కమ్‌లు నోటీ సులను జారీ చేస్తున్నాయి. వ్యవసాయ విద్యుత్‌లో పొదుపు చర్యలను పాటిస్తేనే కొత్త కనెక్షన్లు ఇస్తామని డిస్కమ్‌లు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయంలో విద్యుత్‌ పొదుపు చర్యల పేరుతో డిస్కమ్‌లు ఉచిత విద్యుత్‌పై ఆంక్షల కత్తిని పెట్టాయి. రబీ సీజన్‌, వేసవిలో రోజువారీ విద్యుత్‌ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డిస్కమ్‌లు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.పొదుపు చర్యల్లో భాగంగా రైతులు నాసి రకం పంపుసెట్లను తొలగించి ఐఎస్‌ఐ ప్రమాణాలు ఉన్న వాటిని అమర్చుకోవాల్సి ఉంటుంది. కెపాసి టర్లు, ఫ్రిక్షన్‌ రహిత ఫుట్‌ వాల్వులు, హెచ్‌డీపీఈ పైపులను మాత్రమే వినియోగించాలి. దీనికోసం రైతులపై కనీసం రూ.50 వేల వరకు ఆర్థికంగా అదనపు భారం పడుతుంది. దీన్ని ఎనర్జీ సర్వీసెస్‌ కంపెనీ (ఎస్కోస్‌)లకు అప్పగించి, ఉచితంగా మోటార్లను మారుస్తామని చెబుతున్న ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్దుష్టమైన కార్యాచరణ ప్రణాళిక చేపట్టలేదు. పొదుపు చర్యలు పాటిస్తేనే కొత్త కనెక్షన్లు ఇస్తామని డిస్కమ్‌లు షరతులు విధిస్తున్నాయి.

సదరన్‌ డిస్కమ్‌ పరిధిలోని ఎనిమిది జిల్లాల్లో ఇప్పటికే వ్యవసాయ మోటార్లకు కెపాసిటర్లను అమ ర్చారు ఈ డిస్కమ్‌ పరిధిలో గత ఏడాది నవంబర్‌ నాటికి మొత్తం 11,65,817 వ్యవసాయ కనెక్షన్లు ఉండగా 86.27 శాతం మోటార్లకు కెపాసిటర్లను బిగించారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో సదరన్‌ డిస్కమ్‌ యాజమాన్యం 71,500 కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వనుంది. ఉత్తరాంధ్రలోని అయిదు జిల్లాలకు విద్యుత్‌ సరఫరాను పర్యవేక్షించే ఈస్టర్న్‌ డిస్కమ్‌ వచ్చే ఆర్థిక సంవత్సరంలో తొమ్మిది వేల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేయనుంది. గత ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఈ డిస్కమ్‌ పరిధిలో 2,11,445 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. 90 శాతం మోటార్ల మార్పిడి పూర్తయింది. చాలా ప్రాంతాల్లో ఈ భారాన్ని రైతులే భరిస్తున్నారు.

2015-16లో వ్యవసాయానికి ఏడు గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడానికి మొత్తం 10,779.19 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం అవుతుందని రెండు డిస్కమ్‌లు లెక్క కట్టా యి. ఇందులో సదరన్‌ డిస్కమ్‌ వాటా 8829.57 మిలియన్‌ యూనిటు. వ్యవసాయ కనెక్షన్లలో కరెంటు చౌర్యం అధికంగా ఉంటోందని డిస్కమ్‌లు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి నివేదించాయి. దీన్ని అడ్డుకోవడానికి శాస్త్రీయ పర మైన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశాయి.

సేద్యానికి అందే ప్రతి యూనిట్‌నూ లెక్కిం చేలా వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన మీటర్లను అమర్చుతున్నాయి. ఈస్టర్న్‌ డిస్కమ్‌ పరిధిలోని శ్రీకా కుళం, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు సర్కిళ్లలో 3856, సదరన్‌ డిస్కమ్‌ పరిధి లోని 5507 వ్యవసాయ ట్రాన్స్‌ఫా ర్మర్లకు మీటర్లను అమర్చారు. విద్యుత్‌ దుర్వినియో గాన్ని అరికట్ట డానికి ఉద్దేశించిన హైఓల్టేజీ డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫా ర్మర్లకు కూడా వందశాతం మీటర్లను బిగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: