ఒకప్పుడు తెలుగు వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగిన తార విజయశాంతి అలియాస్‌ రాములమ్మ. లేడీ ఒరియెంటేడ్‌ పాత్రలతో కథానాయకులతో ఏ మాత్రం తీసిపోకుండా నటించి లక్షలాది మంది ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రను వేసుకుని లేడీ అమితాబ్‌గా పేరుతెచ్చుకున్న విజయశాంతి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో సమానంగా పారితోషికం తీసుకున్న ఏకైక హీరోయిన్‌ ఆమె. విజయశాంతి తొలుత బీజేపీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. 2004లో తల్లితెలంగాణ పార్టీని స్థాపించి 2009 ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ పార్టీలో విలీనం చేసిన దానికి బహుమానంగా మెదక్‌ ఎంపీగా అయిన విషయం విధితమే. అయితే గతేడాది కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణను ఇవ్వడం తో అనూహ్య పరిస్థిితులలో కాంగ్రెస్‌ కండువాను కప్పుకునారామె. అదే ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో

మెదక్‌ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యరిగా పోటీ చేసి ఓడిపోడియారు రాములమ్మ. అప్పటి నుంచి మౌనంగా ఉంటున్న రాములమ్మ మరలా క్రీయా శీలక రాజకీయాలలోకి వస్తారా? లేదంటే, సినిమాలలో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారా? అనే దానిపై జోరుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మెదక్‌ నుంచి ఎమ్మెలెెెెెెగా పోటీ చేసి ఓడిపోయాక..కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన మేథోమథనానికి సైతం ఆమె దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న ఆమె రాజకీయాలపై ప్రస్తుతం రకరకాలుగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నవి. రాములమ్మ

రాజకీయాలలో కొనసాగుతారా? లేదంటే, సినిమాల్లో కొన సాగుతారా? ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా? లేకుంటే, రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన బీజేపీలోకి వెళ్తారా? అనే దానిపై రాజకీయ వర్గాలలో వాడి వేడిగా చర్చ సాగుతుండగా...ఆమె అభిమానులలో ఆసక్తి నెలకొన్నది. ఒక మాటలో చెప్పాలంటే ఉత్కంఠ నెలకొన్నది. ఇదిలా ఉంటే, విజయశాంతి మరోమారు తన ముఖానికి మేకప్‌ వేసుకోవడానికి మానసికంగా సిద్ధమైనట్లు ఆమె సన్నిహితుల ద్వారా తెలుసున్నది. 1990వ దశకంలో దాసరి నారాయణరావు దర్శకత్వంలో విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన 'ఒసేయ్‌ రాములమ్మ' ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్‌లో 'ఒసేయ్‌ రాములమ్మ'కు సీక్వెల్‌గా 'ఒసేయ్‌ రాములమ్మ-2'ను రూపొందించే పనిలో ఉన్నట్లు సమాచారం. మారిన కాలానికనుగుణంగా ఒసేయ్‌ రాములమ్మ 2 సినీమా ఉంటుందనీ తెలస్తున్నది. ఒసేయ్‌ రాములమ్మ -2తో పాటు, మరో ప్రముఖ దర్శకుడు బి.గోపాల్‌, ప్రముఖ హీరో గోపిచంద్‌ కాంబినేషన్‌లో తెరకెక్కబోతోన్న మరో సినీమాలో కూడా రాములమ్మ నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ సినీమాకు సంబంధించి కూడా దర్శకుడు బి.గోపాల్‌ విజయశాంతితో మాట్లాడినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వడంతో ఆ పార్టీ కండువాను కప్పుకున్న ఆమె...ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీకి మనుగడ లేదనీ, దీనికి తోడుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీలో ఛరీష్మా గల నాయకుడు ఒక్కడంటే ఒక్కడు లేకపోవడం, ఉన్న నాయకుల్లో 'ఐ'క్యమత్యం లేకపోవడం వల్ల తాను కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగినా పెద్దగా ప్రయోజనం లేదనీ విజయశాంతి అభిప్రాయానికి వచ్చారనీ తెలుస్తున్నది. దీనితోనే ఓ వైపు సినీమాల్లో నటించడంతో పాటు, తాను రాజకీయ అరంగేట్రం చేసిన బీజేపీలో చేరాలంటూ వచ్చిన ఆహ్వానంపై కూడా విజయశాంతి సీరియస్‌గా ఆలోచన చేస్తున్నట్లు అత్యంతమైన విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఏది ఏమైనా విజయశాంతి పయనంపై అనేక రకాలుగా ప్రచారం జరుగున్నది. అయితే, ఆమె మాత్రం ప్రస్తుతానికి పూర్తి రాజకీయాల్లో కొనసాగాలా? లేదంటే, సినీమాల్లో నటించాలా? అన్నది మాత్రం తేల్చుకోలేకపోతున్నట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: