వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం ఉదయం తణుకు రైతు దీక్షకు బయల్దేరారు. లోటస్ పాండ్ నుంచి ఆయన హైదరాబాద్ నుంచి విమానమార్గంలో రాజమండ్రి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన తణుకు చేరుకుంటారు.

ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడుతూ, చంద్రబాబు మాటలతో మోసపోయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న రైతులు, మహళలు, ప్రజలకు అండగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రెండు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిరాహార దీక్ష చేపడుతున్నారు.

ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తణుకు హైవే పక్కన ఏర్పాటు చేసిన దీక్షాస్థలిలో శనివారం ఉదయం పదిన్నర నుంచి ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు జగన్ దీక్ష కొనసాగిస్తారు. మరోవైపు వైఎస్ జగన్ దీక్ష కోసం భారీగా జనసందోహం తరలి వస్తోంది. తణుకు పట్టణం జనసంద్రమైంది.

.

మరింత సమాచారం తెలుసుకోండి: