పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల దీక్ష ప్రారంభమయింది. రైతులను, మహిళలను తెలుగుదేశం ప్రభుత్వం వంచిస్తోందని... దీనికి నిరసనగా దీక్ష చేపడుతున్నట్టు జగన్ తెలిపారు.

తొలుత దీక్షా స్థలంలో ఏర్పాటు చేసిన వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించిన అనంతరం జగన్ దీక్షలో కూర్చున్నారు. ఆయనకు సంఘీభావం తెలుపుతూ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు కూడా దీక్షలో కూర్చున్నారు.

ఎన్నికల హామీలను గాలికొదిలేసిన చంద్రబాబు... ప్రజలను మోసం చేస్తున్నారని ఈ సందర్భంగా జగన్ అన్నారు.తాను చేస్తున్న రెండురోజుల నిరాహార దీక్ష రైతులు, ప్రజల కోసమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ తెలిపారు. ఈ మధ్యాహ్నం తణుకులో రెండు రోజుల నిరాహార దీక్షకు కూర్చున్న ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.

...ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను, ప్రజలకు ఇచ్చిన మాటను చంద్రబాబు తప్పారని, అందువల్ల టీడీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకే దీక్ష తలపెట్టానని జగన్ తెలిపారు. డ్వాక్రా మహిళల నుంచి రైతులు, నిరుద్యోగుల వరకూ తన అబద్దాలతో బాబు మోసం చేశారని ఆరోపించారు. దీక్ష ముగిసిన తరువాత సుదీర్ఘంగా ప్రసంగిస్తానని వెల్లడించిన జగన్ అధికారికంగా నిరాహార దీక్షను ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: