బలమైన క్యాడర్ లేడు.. సరైన నేత లేడు.. ఈ రెండూ భారతీయ జనతా పార్టీకి దక్షిణాదిలో మైనస్ పాయింట్లు. ఏపీలో అయినా.. తమిళనాడులో అయినా బీజేపీ పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అలాగే ఉంది అంటే.. పై రీజన్లే అందుకు కారణాలు. అయితే వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. భారతీయ జనతా పార్టీ నేతల మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి.

తాజాగా కమలం పార్టీ నేతల మురళీధరరావు మాట్లాడుతూ.. తమిళనాడులో తమ పార్టీ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. తమిళనాడులో జయతో తమకు ఎలాంటి ఒప్పందాలూ లేవని.. తమ పార్టీ సింగిల్ గా ఎదగడానికే ప్రయత్నిస్తోందని ఆయన చెప్పుకొచ్చాడు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు అయిన డీఎంకే, అన్నాడీఎంకేలతో తలపడి.. ప్రత్యామ్నయ శక్తిగా ఎదుగుతామని ఆయన అన్నాడు.

మరి బీజేపీకి తమిళనాడులో సరైన లీడర్ లేడు. రజనీకాంత్ పై ఎన్నో ఆశలు పెట్టుకొన్నా.. తలైవా మాత్రం రంగంలోకి దిగలేదు. రజనీని రంగంలోకి దించాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు వృథానే అని ఇప్పటికే స్పష్టం అయ్యింది. ఇక దశాబ్దాలకు దశాబ్దాలు గడిచిపోయినా.. తమిళనాడులో లోకల్ గా కమలం పార్టీకి సరైన నేత ఒక్కరూ లేరు.

ఇక క్యాడర్ కహానీ మాట్లాడకపోవడమే మంచిది. మొన్నటి ఎన్నికల్లో ఆరు పార్టీలతో పొత్తు పెట్టుకొని వెళ్లినా బీజేపీ ఒక్కటంటే ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. మరి అంతమంది తో పొత్తు పెట్టుకొని వెళితేనే దక్కింది అది. అలాంటి బీజేపీకి అక్కడ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేంతా ఉందా?! అనేది ఆలోచించాల్సిన పాయింట్ కాదా?!

మరింత సమాచారం తెలుసుకోండి: