పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమ వారం నుండి ప్రారంభం కానున్నాయి. ఈ సమావే శాలు నరేంద్రమోడీ ప్రభుత్వానికి అగ్నిపరీక్షగా మార నున్నాయి. ప్రతిపక్షాలు లేవనెత్తే సమస్యలను పరిగణ నలోకి తీసుకుంటామని, అన్ని సమస్యలపై చర్చకు వెనుకాడబోమని హామీ ఇచ్చినప్పటికీ బడ్జెట్‌ సమావే శాలు కేంద్ర ప్రభుత్వానికి కత్తిమీద సాముగానే విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, సామాన్య ప్రజ లకు ప్రయోజనం చేకూర్చేందుకు సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్‌ సమావేశాలకు ముందు కేంద్రం ఆదివారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. బడ్జెట్‌ సమావేశాలు అత్యంత కీలకమైనవని, అందు వల్ల పార్లమెంట్‌ సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని పార్టీలను మోడీ కోరారు.

తమ ఆశలు, ఆకాంక్షలతో ప్రజలు బడ్జెట్‌ సమావేశాల వైపు చూస్తున్నారని, పేదల బ్రతుకులు మార్చేలా సమావేశాలు నిర్వహించుకో వాల్సిన ఆవశ్యకత ఉందని మోడీ పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే దిశగా మనం కృషి చేయాలని, అందుకు పార్లమెంట్‌ ఉభయ సభల్లో తమకు లభించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్ని పార్టీల నాయకులకు అఖిలపక్షం వేదికగా విన్నవించారు. మోడీ ప్రభుత్వం తన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్ట నున్నది. ఉభయ సభలు సజావుగా నడుపుకోవడం అన్ని పార్టీల సమష్టి బాధ్యత అని ప్రధాని చెప్పారు. సామాన్య ప్రజలకు ప్రయోజనాలు కలిగేలా సమష్టిగా కృషి చేద్దామని అన్నారు. ప్రతిపక్షాలు పలు అంశాలు లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాయని గుర్తు చేస్తూ 'ప్రతిపక్షాల ప్రాధాన్యత, ప్రాముఖ్యతల ఆధారంగా అన్ని అంశాలను చర్చిద్దాం. మీరు లేవనెత్తే ప్రతి అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటాం' అని ప్రధాని అఖిలపక్షంలో హామీ ఇచ్చారు.

సభను సజావుగా జరుపుకోవడం, తాను అనుకున్న బిల్లులకు ఆమోదం పొందేలా చేయడం కోసం ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగా ప్రతిపక్షాలకు సున్ని తంగా విజ్ఞప్తి చేస్తున్నది. అంతకుముందు పార్లమెం టరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు నేరుగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివా సానికి వెళ్లారు. చట్టసభలు సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆమెకు విన్నవించారు. సభ నిర్వహణలో సహకారం కావాలని అడిగారు. 'ప్రతి పక్షానికి కావాల్సిన సమయం ఇవ్వడానికి, సమస్యలు లేవనెత్తడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ప్రతిపక్షం లేవనెత్తే సమస్యలపై చర్చకు ప్రభుత్వం సుముఖంగా ఉంది. సభ సజావుగా జరగడానికి సహకరించాలని మాత్రమే మేము విజ్ఞప్తి చేస్తున్నాం' అని ఆ తర్వాత వెంకయ్యనాయుడు మీడియాకు చెప్పారు. ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులు ప్రతిపక్షాలను సంతృప్తి పరచలేకపోయాయి. ప్రభుత్వంపై యుద్ధానికే సన్నద్ధమవుతున్నాయి.

ప్రత్యేకించి భూ సేకరణ చట్ట సవరణపై మోడీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి, ఇరుకున పెట్టడానికి సమాయత్తమవుతున్నాయి. ఐదు ఇతర ఆర్డినెన్స్‌లు చట్టాలుగా రూపుదిద్దుకోవడానికి విస్తృత ఏకాభిప్రాయం వచ్చినప్పటికీ భూ సేకరణ ఆర్డినెన్స్‌పై కొన్ని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వెంకయ్యనాయుడు అంగీకరించారు. మంచి ఉత్సాహపూరిత వాతావరణంలో సోనియాతో సమావేశం జరిగిందని వెంకయ్య చెప్పారు. అయితే, భూ సేకరణ ఆర్డినెన్స్‌పై సోనియా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రజలకు సహాయపడని ఆర్డినెన్స్‌లు, బిల్లులకు కాంగ్రెస్‌ మద్దతివ్వబోదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్‌ స్పష్టం చేశారు. భూసేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించి తీరుతా మని జేడీయూ అధినేత శరద్‌ యాదవ్‌ తేల్చిచెప్పారు. ఈ ఆర్డినెన్స్‌ను వెనక్కి తీసుకునేంత వరకూ కేంద్రంపై పోరాటం సాగిస్తామని చెప్పారు. బ్రిటీష్‌ కాలం నాటి చట్టాలు కూడా ఇంత భయంకరంగా లేవని వ్యాఖ్యానించారు. భూ సేకరణ సవరణ బిల్లును సమీక్ష కోసం పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీకి పంపాలని ఐఎన్‌ఎల్‌డీ నాయకుడు దుశ్యంత్‌ చౌతాలా డిమాండ్‌ చేశారు. భూ సేకరణ అనేది భావో ద్వేగంతో కూడిన అంశమని, దీనిని రాజకీయం చేయవద్దని, దీనిపై చిత్తశుద్ధితో చర్చిద్దామని వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేశారు. ఏ సమస్యపైనైనా వైరుధ్యాలను పరిష్కరించుకునేం దుకు ప్రతిపక్షాలతో చర్చించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉందని ఆయన చెప్పారు. బడ్జెట్‌ సమావేశాలు ఫలవంతం కావడానికి పరస్పర సహకారం అవసరమని వ్యాఖ్యానించారు. భూ సేకరణ చట్టంపై స్పందిస్తూ 2013లో వచ్చిన ఈ చట్టంలోని నిబంధనలు కింద భూ సేకరణ కష్టసాధ్యమని రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వాలు విన్నవించాయని వెంకయ్య చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాతే తమ ప్రభుత్వం పలు సవరణలు తీసుకొచ్చిందని వివరించారు. కొతమంది బీజేపీ సభ్యులు, సంఫ్‌ుపరివార్‌ నాయకుల మతపరమైన వ్యాఖ్యలు, చర్చిలపై దాడులు, స్వైన్‌ఫ్లూ విజృంభణ, వ్యవసాయ సంక్షోభం, భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరతో పాటు పలు అంశాలు అఖిలపక్ష సమావే శంలో చర్చకు వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని వ్యాపమ్‌ స్కామ్‌, విద్య కాషాయీకరణ, వ్యవసాయ సంక్షో భంపై చర్చించాలని కొంతమంది పట్టుబట్టారు. మహారాష్ట్రలో సీపీఐ నాయకుడు గోవింద్‌ పన్సారే హత్యను ఆ పార్టీ నాయకుడు డి.రాజా లేవనెత్తారు. పన్నారే హత్యపై అన్ని పార్టీలు ఆందోళనలో ఉన్నట్లు శివసేన నాయకుడు సంజరు రౌత్‌ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: