యాంకర్ నవీన్ అంటే.. నవీనా ఆయనెవరు.. ఈ పేరే పెద్దగా వినలేదు.. ఆయన ఎలా ఫేమస్ యాంకర్ అవుతాడు.. అని ఎవరైనా ప్రశ్నిస్తారు. ఔను మరి ఆయన్ను నవీన్ అని చెబితే ఎవరూ గుర్తుపట్టరు.. కానీ తీన్మార్ మల్లన్న అంటే చాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు.

వీ6 ఛానల్ ద్వారా పరిచయమైన ఈ నవీన్... తీన్మార్ మల్లన్న పాత్రలో జీవించారు. ఇంకోవిషయం ఏంటంటే... ఈ పాత్ర సృష్టికర్త కూడా ఆయనే.. స్వతహాగా యాంకర్ కాకపోయినా...ఓ కొత్త కాన్సెప్టులో వీ 6 యాజమాన్యాన్ని మెప్పించి.... మల్లన్న పాత్రతో బుల్లితెరపై ప్రత్యక్షమయ్యాడు.

అచ్చమైన తెలంగాణ యాసతో ముసలి వేషంతో మల్లన్న చెప్పే వార్తలు... వీ 6 ఛానల్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. ఈ షో బంపర్ హిట్టైంది. అలా తెలంగాణలో పాపులర్ అయిన మల్లన్న.. అదే నవీన్... ఇప్పుడు పొలిటిక్సులోనూ తన అదృష్టం పరీక్షించుకుందామనుకుంటున్నాడు. . వరంగల్ - ఖమ్మం నల్గొండ పట్టభద్రల స్ధానానికి పోటీకి దిగుతున్నాడు.

రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తితోనే... తీన్మార్ వార్తలకు గుడ్ బై చెప్పిన మల్లన్న.... కొన్నాళ్లుగా ఎమ్మెల్సీ ఎన్నికలపైనే దృష్టిపెట్టాడు. టీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని భావించినా.. ఎందుకనో కుదరలేదు. ఇప్పుడు కాంగ్రెస్ తరపున బరిలో దిగేందుకు సిద్ధమయ్యాడు. తెలంగాణ కాంగ్రెస్ కూడా మల్లన్న అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. మరి మల్లన్న కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి.. గెలవగలుగుతాడా.. ఆయన ఎంపిక సరైందేనా..? వెయిట్ అండ్ సీ..

మరింత సమాచారం తెలుసుకోండి: