ఎంతో పోరాడి ప్రత్యేక తెలంగాణను సాధించుకొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిందన్నారు.. స్వయం పాలనకు అవకాశం వచ్చిందని మురిసిపోయారు. మరి ఇదంతా జరిగి సరిగా ఏడాది కూడా కాలేదు కానీ.. అప్పుడు తెలంగాణలో ప్రాంతీయ విబేధాలు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులూ ఆంధ్రా పాలకులు.. ఆంద్రా పెత్తనం అంటూ విరుచుకుపడిన ఇక్కడి నేతలు ఇప్పుడు తమలో తాము కలహించుకోవడం మొదలుపెట్టారు.

ఈ కలహాల్లో కూడా ప్రాంతీయ వాద టోన్ వినిపిస్తుండటమే విశేషం. ఇప్పుడు తెలంగాణ ప్రాంత నేతల్లో ఉత్తర, దక్షిణ తెలంగాణ గొడవలు అధికం అవుతున్నాయి. రకరకాల అంశాలను ప్రస్తావించుకొంటూ.. వీరు దుమ్మెత్తిపోసుకొంటున్నారు. దక్షిణ తెలంగాణల ఉత్తర తెలంగాణ పెత్తనం ఏమిటనేది వీరు బాగా హైలెట్ చేసుకొంటున్న అంశం.

ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చిన్నారెడ్డి, డీకే అరుణ వంటి వాళ్లు దక్షిణ తెలంగాణ కు అన్యాయం జరిగిపోతోంది.. ఉత్తర తెలంగాణ వాళ్లు పెత్తనం చెలాయిస్తున్నారు.. అని ఆందోళన వ్యక్తంచేస్తుండగా.. వీరికి తోడు రేవంత్ రెడ్డి తయారయ్యాడు. ఈ తెలుగుదేశం నేత ఇది వరకే అనేకసార్లు ఉత్తర తెలంగాణ వాళ్లపై విరుచుకుపడ్డాడు.

ఇప్పుడు ఈయన మరో అంశాన్ని ప్రస్తావిస్తూ ఉత్తర తెలంగాణ నేతలపై విమర్శలు చేశాడు. మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఉత్త ర తెలంగాణ వ్యక్తిని తెచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టాడని ఈయన కేసీఆర్ పై విరుచుకుపడ్డాడు. ఇదేం తీరని ప్రశ్నించాడు. దక్షిణ తెలంగాణపై ఉత్తర తెలంగాణ పెత్తన ఏమిటని ప్రశ్నించాడు. మరి చూస్తుంటే తెలంగాణలో ఈ ఉత్తర, దక్షిణ తెలంగాణ విభేదాలు తీవ్రస్థాయికే చేరేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: