ఎపి ఎన్.జి.ఓ నేత అశోక్ బాబు కూడా ఎమ్మెల్సీ రేసులోకి వచ్చారు. తెలంగాణ ఎన్.జి.ఓ సంఘం అద్యక్షుడు దేవీ ప్రసాద్ ను టిఆర్ఎస్ తన అబ్యర్ధిగా రంగంలో దించుతున్న నేపద్యంలో ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యం ఏర్పడింది.

దేవీ ప్రసాద్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తే, అశోక్ బాబు సమైక్య ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించారని ఆయన కు మద్దతు ఇస్తున్న ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.ఎన్.జి.ఓ నేతలు రాజకీయాలలకి రావడం ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు అవడం కొత్త కాదు. గతంలో జై ఆంద్ర ఉద్యమంలో పాల్గొన్న ఎన్.జి.ఓ నేత ఆమనగంటి శ్రీరాములు ఏలూరు నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు.

కె.ఆర్.ఆమోస్ ఎమ్మెల్సీ అయ్యారు. స్వామి గౌడ్ శాసనమండలి ఛైర్మన్ అయ్యారు. కనుక అశోక్ బాబు ఎమ్మెల్సీ అవడానికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు.కాకపోతే టిడిపి అదినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే చేస్తే చాలు.

ఎమ్మెల్సీ పదవులకు టిడిపిలో డిమాండ్ బాగా ఉంది. అయినా చంద్రబాబు తలచుకుంటే పెద్ద ఇబ్బంది కాదు.లక్షల మంది ఉద్యోగుల సంఘానికి అశోక్ బాబు ప్రాతినిద్యం వహిస్తున్నారు కనుక చంద్రబాబు దీనికి ఆమోదం తెలపవచ్చేమో!

మరింత సమాచారం తెలుసుకోండి: