అండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..! అయితే బీకేర్‌ఫుల్ మరి. హ్యకర్లు అండ్రాయిడ్ ఫోన్లలోకి చొచ్చుకువస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఉన్న సొత్తు కాజేయడానికి వేచిస్తున్నారు. గేమ్స్ డౌన్‌లోడ్ చేసేప్పుడు హకర్లు వైరస్ పంపిస్తూ ఆగం చేస్తున్నారు. వైరస్ సొకితే మీ ఫోన్ మీ చేతుల్లో ఉన్నా హ్యాకర్‌ల మాటే ఎక్కువగా వింటుంది. ఇలాంటి వైరస్ పూరిత గేమ్స్ డౌన్ లౌడ్ అయిన ఓ వ్యాపారి ఏకంగా రూ.32 లక్షలు పోగొట్టుకున్నాడు. హ్యాకర్‌లు వైరస్‌తో చేస్తున్న ఈ దాడులతో అండ్రాయిడ్ ఫోన్ల వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

వైరస్ ఎలా పంపిస్తారంటే..హ్యాకర్‌లు అండ్రాయిడ్ మొబైల్‌లో వైరస్‌ను ఎక్కించేందుకు టెక్నాలజీ పరంగా అప్‌డేట్ అవుతున్నారు. దీని కోసం నిత్యం మార్కెట్‌ను స్టడీ చేస్తున్న హ్యాకర్‌లు ఎక్కువగా బూమ్ ఉన్న చిన్న పిల్లల వీడియో గేమ్స్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ వీడియో గేమ్‌ను హ్యాకర్‌లు ఒరిజినల్ డెటాను అండ్రాయిడ్ మొబైల్ ఫోన్ నుంచి తమ కంప్యూటర్‌లోకి డౌన్‌లోడ్ చేస్తున్నారు. ఆ తర్వాత గేమ్‌లోకి వైరస్‌ను ఇన్‌జస్ట్ చేసి దాన్ని తిరిగి ఒరిజినల్ గేమ్‌లోకి అప్‌లోడ్ చేస్తున్నారు. ఇలా అప్‌లోడ్ అయిన గేమ్‌ను అండ్రాయిడ్ ఫోన్‌లలో డౌన్‌లోడ్ చేసుకోగానే వైరస్ మొబైల్‌లోకి ఎంట్రీ అవుతుంది. దీంతో మీ డెటాను ఎప్పటికప్పుడు హ్యాకర్‌లకు అందుతుంది. దీంతో హ్యాకర్‌లు మీ ఫోన్‌లోని ప్రతి అంశాన్ని ఈజీగా స్టడీ చేయడంతో పాటు మీరు జరిపే ప్రతి ఆడియో, వీడియో కన్వర్జేషన్‌లను వింటారు. అదే విధంగా మీ ఆన్‌లైన్ అకౌంట్ వివరాలను హ్యాకర్‌లు సులువుగా కాజేస్తారు. అంతటితో ఆగకుండా మీ పిన్ నెంబరును దొంగిలించి మీ అకౌంట్‌లోని నగదును మీకు తెలియకుండానే కాజేసే అవకా శాలు ఉన్నాయి. ముఖ్యంగా నైజీరి యన్‌లతో పాటు కొత్త కొత్తగా హ్యకర్‌లుగా మారుతున్న క్రిమినల్స్ ఈ విధమైన స్పైకు పాల్పడుతున్నారని సాఫ్ట్‌వేర్ నిపు ణులు పేర్కొంటున్నారు.

వైరస్ ఎంట్రీతో రూ.32 లక్షలు కల్లాస్..ఇటీవల గుజరాత్‌కు చెందిన ఓ వ్యాపారి ఈ వైరస్ భూతాన్ని ఎదుర్కొన్నాడు. తన అండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఆన్‌లైన్ అకౌంట్ లోని దాదాపు రూ.32 లక్షలు డ్రా అయినట్లు గుర్తించాడు. దీనిపై అక్కడి పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఎలాంటి క్లూ దొరకలేదు. తర్జనభర్జనలు పడిన తర్వాత హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ నిపుణుడిని సంప్రదిస్తే తన అండ్రాయిడ్ ఫోన్ ద్వారా ఈ లావాదేవిలు జరిగాయని నిర్ధారించారు. సదురు వ్యాపారి బిడ్డ వీడియో గేమ్స్‌ను డౌన్ లోడ్ చేసిందని వివరించారు. దానిపై దృష్టి పెట్టిన ఐటీ నిపుణులు పరిశోధించి ఆ వీడియో గేమ్‌ల ద్వారా వ్యాపారి ఫోన్‌లో హ్యాకర్‌ల వైరస్ డౌన్ లోడ్ అయినట్లు గుర్తించారు. ఆ హ్యాకర్ వ్యాపారి అకౌంట్‌ను నైజీరియా నుంచి ఆపరేట్ చేసినట్లు తేలింది. దీంతో అప్రమత్తమైన నిపుణులు మన నగర వాసులను హెచ్చరిస్తున్నారు. నగరంలో కూడా అత్యధికంగా అండ్రాయిడ్ మొబైల్‌ను ఉపయోగిస్తుండడంతో ఈ తరహాలో హ్యాకర్‌లు మెరుపు దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

అన్‌నోన్ సోర్స్ ఆప్షన్‌ను ఆఫ్‌లో పెట్టుకోవాలి !వైరస్‌ను ఎదుర్కునేందుకు మార్కెట్ లో అత్యధిక రే టింగ్ ఉన్న సె క్యురిటీ ఆప్షన్స్ ఉపయోగించుకోవాలి. దీనికి తోడు అండ్రాయిడ్ మొబైల్‌లో సిస్టమ్ సెట్టింగ్స్ నుంచి సెక్యూరిటీ ఆప్షన్‌కు వెళ్లాలి. సెక్యూరిటీ ఆప్షన్ క్లిక్ చేస్తే అందులో అన్‌నోన్ సోర్స్ ఆప్షన్ డిస్‌ప్లే అవుతుంది. దీన్ని ఆన్ చేస్తే ఏలాంటి వైరస్ అయినా ఈజీగా అప్‌లోడ్ అవుతుంది. అదే ఈ అప్షన్ ఆఫ్‌లో ఉంటే వైరస్ ఎంట్రీ అయ్యే అవకాశం లేదు. -సందీప్, ఐటీ నిపుణులు

మరింత సమాచారం తెలుసుకోండి: