ఇంతలోనే ఎంత మార్పు.. ఒక రాజకీయ పార్టీ అధికారంలో లేనప్పుడు ఎలా వ్యవహరిస్తుంది.. అధికారం చేతికి అందాకా ఎలా మారిపోతుంది.. అనే అంశాన్ని పరిశీలించడానికి ఇంతకన్నా వేరే ఉదాహరణ అవసరం లేదేమో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీరును పట్టి చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థం అవుతుంది. కేంద్రంలో అధికారం చేతికి అందాకా భారతీయ జనతా పార్టీ చాలా అంశాల్లో యూ టర్న్ తీసుకొందన్న విషయం తెలిసిందే.

కేవలం రాజకీయ , ఆర్థిక విధానాల్లోనే కాదు.. భారతీయ జనతా పార్టీ వ్యక్తుల విషయంలో కూడా యూ టర్న్ తీసుకొంది. అందుకు రుజువు ఇప్పుడు బీజేపీ వాళ్లు అన్నా హజారే విషయంలో వ్యవహరిస్తున్న తీరు! గతంలో అన్నా హజారే లోక్ పాల్ చట్టం డిమాండ్ తో రామ్ లీలా మైదాన్ లో దీక్షకు కూర్చొనప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్లు చాలా హడావుడి చేశారు.

అన్నాకు మద్దతు ప్రకటించారు. ఆయనకు తాము మద్దతుగా ఉంటామన్నారు. లోక్ పాల్ బిల్లు కావాల్సిందే అన్నారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ గద్దె దిగాలని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు కొంతమంది వ్యక్తిగతంగా రామ్ లీలా మైదాన్ కు వెళ్లి అన్నాకు మద్దతు ప్రకటించి వచ్చారు. అయితే అదంతా గతం!

అప్పటికి భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో ఉంది.. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పోరాడే ఎవరినైనా కలుపుకుపోవడానికి సిద్ధం గా ఉంది. అయితే ఇప్పుడు బీజేపీకి అధికారంలో ఉంది.. దీంతో అన్నా హజారే వ్యక్తపరుస్తున్న ఆందోళనలు ఈ పార్టీకి పట్టకుండా పోయాయి. భూ సేకరణ బిల్లు రైతులకు చాలా అన్యాయం చేస్తుందని హజారే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రైతులను కలుపుకొని ఆయన పోరాటం కూడా చేస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మాత్రం తమకేం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. మరి ప్రతిపక్షంలోఉ న్నప్పటికీ, అధికారం లోకి వచ్చేసరికి కమలం పార్టీలో ఈ తేడా, అవకాశవాదం ప్రస్ఫుటం అవుతోంది. ఇదీ కథ.

మరింత సమాచారం తెలుసుకోండి: