ఒక వైపు ప్రకృతి, మరో వైపు ప్రభుత్వం, దళారులు, అధిక ధరలు వంటి సమస్యలతో సతమతమవుతున్న రైతు బిడ్డలను ఎవ్వరు ఆదుకుంటారో అర్థం కాని ప్రశ్న, అస్సలు జవాబే లేని ప్రశ్న. సకాలంలో వర్షాలు పడవు , యూరియా ధరలు అధికం, విత్తనాలు దొరకవు, అప్పులు చేసి బోర్లు వేసినా అదీ ఎండిపోతుంది, పోనీ పంటలు పండినా అవి దక్కే సరికి అకాల వర్షాలు లేక అధిక వర్షాలు నోట్లో మట్టి కొడుతున్నాయి. సరైన సమయంలో విద్యుత్ ఉండదు, ఉన్న కాసేపు కూడా వోల్టేజి సరి లేక మోటార్లు కాలిపోతుంటాయి. రైతులను అదుకోడానికి సమగ్ర పథకాలను అమలు చేసి పంటకి మొదలు సమగ్రంగా మార్కెటింగ్ సౌకర్యాలు , రవాణా మరియు ఆర్ధిక మద్దతు ఇచ్చిన నాడే రైతు బాగుండేది, మనం బగుపడేది. చెప్పుకోడానికి అన్నీ రైతు ప్రభుత్వాలే కాని ఫలితం శూన్యం. 

మరింత సమాచారం తెలుసుకోండి: