ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై ప్రతిపక్ష నేత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ నిప్పులు చెరిగారు. నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్న చంద్రబాబు ఇంటికి వెళ్లే సమయం ఆసన్నమైందని జగన్ అన్నారు. అందరం కలిసికట్టుగా చంద్రబాబును ఇంటికి పంపిద్దామని వైయస్ జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా పూడేరు సర్కిల్లో ఆయన మంగళవారంనాడు జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు.

ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేలా ఒత్తిడి తెస్తాం అన్నారు రైతుల్లో ధైర్యం నింపేందుకే భరోసా యాత్ర అని ఆయన అన్నారు అప్పుల బాధ తాళలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలపై బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది చంద్రబాబు అప్పుడు శానససభలో మాట్లాడినప్పుడు రైతులెవరూ

ఆత్మహత్యలు చేసుకోలేదని అన్నారని ఆయన గుర్తు చేస్తూ తీరా తాను పరామర్శ యాత్రకు బయలుదేరుతున్నట్లు తెలియగానే ఒక్క అనంతపురం జిల్లాలోనే 26 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారని అన్నారు. అప్పుడు చంద్రబాబుకు రైతన్నల ఆత్మహత్యలు గుర్తుకు రాలేదా అని జగన్ ప్రశ్నించారు. ప్రశ్నించేవారు వస్తున్నారంటే తప్ప చంద్రబాబుకు రైతు సమస్యలు పట్టవా అని అడిగారు.

రుణాలు మాఫీ చేయకపోతే బాబు ఇంటి ముందు కూర్చుంటాం జగన్ అన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గెలిచిన తర్వాత చంద్రబాబు వాటిని మరిచిపోయారని విమర్శించారు.ఎన్నికలకు ముందు ఎప్పుడు టీవీ ల్లో రుణాలన్నీ మాఫీ చేస్తామనే చెప్పుకొనేవారు అని మహిళలు అన్నారు అనంతపురం జిల్లా హంద్రీనీవా నీళ్లు రావడానికి తానే కారణమని చంద్రబాబు చెప్పడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: