కేంద్ర ప్రభుత్వం మంగళవారం భూ సేకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ సభ నుండి వాకౌట్‌ చేశాయి. దీనికి ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య వాదప్రతివాదనలు జరిగాయి. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించగా ప్రభుత్వం దీనిని ఖండించింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జెట్లీ సభలో మాట్లాడుతూ భూ సేకరణ ఆర్డినెన్సు విషయంలో ప్రభుత్వం అన్ని విధాలుగా అధికారుతో చర్చించిన అనం తరమే ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే సభలో సమాజ్‌ వాది పార్టీ నేత నరేష్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ తాము ఈ అంశంపై ప్రభుత్వానికి నోటీస్‌ ఇచ్చామని, దేశం యావత్తు ఈ ఆర్డినెన్సును వ్యతిరేకిస్తున్నదని, దీనికి నిరసనగా ఢిల్లీలో ప్రదర్శన కూడా జరుగుతున్నదన్నారు.

అయితే రాజ్యసభ ఉప సభాపతి పిజె కురియన్‌ సభ్యులతో మాట్లాడుతూ పార్లమెంట్‌లో ఈ ఆర్డినెన్సును ప్రవేశపెట్టిన అనంతరం దీనిపై చర్చించాలన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్‌ నేత ఆనంద్‌ శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ చేపట్టాలనుకుంటున్న భూ ఆర్డినెన్సును తీవ్రంగా వ్యతిరేకించా రు. తాము నియమావళి 267 కింద ప్రభుత్వానికి నోటీసు పంపామన్నారు. ఇది తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అంశమని పార్లమెంట్‌లో దీనిపై చర్చ జరగాల్సిందేనని పట్టుపట్టారు. తాము ఆర్డినెన్సుల ప్రభుత్వాన్ని కొనసాగబోనివ్వమని హెచ్చరించారు. కాగా దీనిపై కేంద్ర మంత్రి అరుణ్‌జెట్లీ మాట్లాడుతూ ప్రభుత్వం భూ సేకరణ ఆర్డినెన్స్‌ విషయంలో అసంబద్ధంగా వ్యవహరించడం లేదని, ఇందుకు ఉదాహరణగా 636వ ఆర్డినెన్సును ఒకసారి చూడాలన్నారు. దీనిలో 80శాతం వరకూ ఆనంద్‌శర్మకు చెందిన పార్టీ ప్రభుత్వం నెరవేర్చినదేనన్నారు. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వంలో 70 శాతం ఆర్డినెన్సులు కొనసాగాయన్నారు. అలాగే కమ్యూనిస్టు సోదరుల సారధ్యంలో ఏర్పడి ప్రభుత్వ హయాంలో కేవలం 18 నెలలో 77 ఆర్డినెన్సులను తీసుకువచ్చారన్నారు. అందుకే ఈ విషయంలో ప్రభుత్వాన్ని తప్పుపట్టడం సరికాదన్నారు.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌ నేత ఆనందశర్మ మాట్లాడుతూ యుపిఎ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సులు ప్రజామోదం పొందినవేనన్నారు. ఇంతలో ఉప సభాపతి కురియన్‌ కల్పించుకుని సభలో దీనిపై చర్చించేందుకు అనుమతినిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి అరుణ్‌జెట్లీ మాట్లాడుతూ సభకు సభ్యులంతా హాజరైన తరువాత దీనిపై చర్చించాలని కోరారు. కురియన్‌ దీనిపై మాట్లాడుతూ సభ్యులు సభకు రావడం, రాకోవడం వేరే విషయమని, దీనిపై చర్చ జరగడం వలన ఎవరికీ ఎటువంటి అభ్యంత రం లేదని తెలిపారు.

అయితే దీనిపై చర్చకు తాను జీరో అవర్‌ను కేటాయిస్తున్నట్లు తెలిపారు. తరువాత సభలో మిగిలిన సభ్యులు మాట్లాడేందుకు అనుమతినిచ్చారు. సమాజ్‌వాది పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, జెడియులు ఈ బిల్లు రైతు వ్యతిరేక బిల్లుగా పేర్కొన్నాయి. కాగా రాజ్యసభలో సమాజ్‌వాది పార్టీ నేత మాయావతి మాట్లాడుతూ భూ సేకరణ ఆర్డినెన్సు రైతులకు ఎంతమాత్రం ఉపయోగం లేనిదని వ్యాఖ్యానించారు

మరింత సమాచారం తెలుసుకోండి: