గతంలో అన్నా హజారే అవినీతి వ్యతిరేక పోరాటం మొదలు పెట్టినప్పుడు... లోక్ పాల్ బిల్లు డిమాండ్ తో దీక్షకు కూర్చొన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఎంత హడావుడి చేసిందో ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అయితే హైదరాబాద్ లో హల్ చల్ చేశాడు. హజారేకు సంఘీభావంగా బాబు పాదయాత్ర చేపట్టాడు. జాతీయ జెండాను భుజాన వేసుకొని బాబు అపరగాంధేయవాదిగా దర్శనమిచ్చాడు.

మరి ఆ హడావుడి అంతా అప్పటికే పరిమితం. తను అన్నా హజారేకు ఫాలోవర్ ను అనిఅప్పట్లో ప్రకటించుకొన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం ఆయనను పట్టించుకోవడం లేదు. ఒకవైపు హజారే ఢిల్లీలో దీక్షకు కూర్చొన్నారు. ఆయనకు అనేక పార్టీలు మద్దతు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న భూ సమీకరణ చట్ట సవరణలను వ్యతిరేకిస్తూ హజారే గాంధేయ మార్గంలో దీక్ష చేస్తున్నారు.

అయితే అన్నా హజారేకు ఫాలోయర్ ను అని గతంలో చెప్పుకొన్న తెలుగుదేశం అధ్యక్షుడు మాత్రం ఇప్పుడు మారు మాట్లాడటం లేదు. అన్నా మాటే నా బాట అని గతంలో ప్రకటించుకొన్న బాబుకు ఇప్పుడు అన్నా అసలు కనపడటం లేదు. ఎందుకంటే.. ఇప్పుడు బాబు అధికార పక్షంలో ఉన్నాడు.

భూ సేకరణ చట్ట సవరణనలే వ్యతిరేకిస్తున్న అన్నా హజారే.. బాబు ప్రభుత్వం ఏపీలో చేపట్టిన భూ సమీకరణ విధానంపై తీవ్రంగా విరుచుకుపడే అవకాశం ఉంది. అందుకే బాబు కూడా తెలివిగా హజారేగురించి ఇప్పుడు నోరెత్తడం లేదు. అదే మరి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ.. అధికారంలోకి వచ్చినప్పటికీ బాబులో వచ్చిన తేడా!

మరింత సమాచారం తెలుసుకోండి: