హైదరాబాద్ లో డ్రగ్స్ రాకేట్ ఎలా సాగుతుందో తెలియదు కానీ డ్రగ్స్ ముఠాలు పట్టుపడితే మటుకు టాలీవుడ్ ఒక్కసారి ఉలిక్కి పడుతుంది. గతంలో రవితేజ సోదరులు, నిర్మాతలకు మరి కొంత మంది చిన్నా చితకా క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఈ కేసులతో సంబంధాలు ఉన్నాయని రుజువైంది.

ఇక పోతే నిన్న పట్టు పడిన డ్రగ్స్ ముఠాతో నిర్మాత సుశాంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని తెలిసిన విషయమే అయితే ఈయన గతంలో సూపర్ స్టార్ కిడ్నాప్ అనే చిత్రాన్ని నిర్మించాడు. అసలు విషయానికి వస్తే తెలుగు సింగర్ గీతామాధురి ప్రేమించి పెళ్లాడిన యువ హీరో నందు కి ఈ డ్రగ్స్ ముఠాతో సంబంధాలు ఉన్నాయని వార్తలు వినవచ్చాయి.

దీంతో పరేషాన్ అయిన మన హీరో వామ్మో ఈ డ్రగ్స్ రాకేట్ కు నాకు ఎలాంటి సంబంధం లేదు బాబోయ్ అని ఒక మీడియా చానల్ ద్వారా తన ఏకరువు పెట్టుకున్నాడు. కాకపోతే సుశాంత్ రెడ్డి గతంలో ‘ సూపర్ స్టార్ కిడ్నాప్’ సినిమా తీశాడని అందులో తనే హీరోనని దాంతో ఆయన నాకు పరిచయమ్యాడని అంతే తప్పా మరే ఇతర విషయాలతో ఆయనకు నాకు సంబంధం లేదు అని గట్టిగా వాదిస్తున్నాడు యువహీరో.

దీనికొచ్చి నాకు ఆయనకు లింక్ లు ఉన్నాయని డ్రగ్స్ తో నాకు సంబంధం ఉందని రాతలు రాయడం సబబు కాదని దీని వల్ల తన కెరీర్ కు మచ్చ వస్తుందని నందూ వాపోయాడు. ఏదేమైనా హైదరాబాద్ లో డ్రగ్స్ రాకేట్ ఎప్పడు పట్టుపడినా మూలాలు తెలుగు చిత్ర పరిశ్రమలో తేలుతున్నాయని దీని వాల్ల టాలీవుడ్ ప్రతిష్ట దెబ్బతింటుందని పరిశ్రలో పెద్దలు బాదపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: