ఎపి రాజధానిలో జరుగుతున్న మోసం ఛిట్ ఫండ్ కంపెనీల మోసం కన్నా ఘోరమైనదని రిటైర్డ్ ఐఎఎస్ అదికారి, చండీఘడ్ నిర్మాణంలో భూమిక నిర్వహించిన ప్రముఖుడు దేవ సహాయం వ్యాఖ్యానించారు. రాజధాని ప్రాంత రైతులలో భ్రమలు కల్పించి పేద రైతుల పొట్టకొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని ఆయన ఆరోపించారు.

ముప్పై వేల ఎకరాలు తీసుకుని ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు.అత్యంత సారవంతమైన భూములను దాదాపు ఉచితంగా లాక్కొంటోందని ఆయన అన్నారు.జాతీయ ప్రజా ఉద్యమాల కమిటీలో ఆయన కూడా ఉన్నారు.

కొత్త రాజధాని కోసం భూ సేకరణ పేరిట జరుగుతున్న దందా తెల్లవారేసరికి బోర్డు తిప్పేసే ఓ చిట్‌ఫండ్ కంపెనీ మోసం కన్నా పెద్దదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలను నమ్మించడానికి చిట్‌ఫండ్ కంపెనీ వాళ్లు కొంత డబ్బైనా ఇస్తారని, బాబు అండ్ పార్టీ అదీ చేయడంలేదని ఆయన విమర్శించారు.

దీని వెనుక బాబు అండ్ పార్టీ ,మంత్రులు, ఇతర నేతల కొందరి కోటరీ ఉందని అన్నారు.చంద్రబాబు తనకు ఎవరి సలహా అవసరం లేదని అంటున్నారని ఆయన ధ్వజమెత్తారు..........................

మరింత సమాచారం తెలుసుకోండి: