గత రెండు దశాబ్దాల్లో ఇదే మెరుగైన రైల్వే బడ్జెట్ అని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ అన్నారు. రైల్వే మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్ ప్రసంగం తర్వాత జేపీ తన అభిప్రాయాలు వెల్లడించారు. రైల్వే బడ్జెట్ అంటే కొత్త రైళ్లు, భారీ సంఖ్యలో ప్రాజెక్టులు అన్నట్టు కాకుండా

వాస్తవ పరిస్థిితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారని కితాబిచ్చారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించారని ప్రశంసించారు. కాగా, రైల్వే బడ్జెట్ చప్పగా ఉందని పలు పార్టీలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

శివసేన అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతా మాయ తప్ప మరేమీలేదని ఆ పార్టీ ఎంపీ గజానన్ కీర్తికార్ అభిప్రాయపడ్డారు. ఇక, సీపీఐ తెలంగాణ విభాగం నిజామాబాదులో ఏకంగా ధర్నా నిర్వహించింది.

అటు, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ మాత్రం బడ్జెట్ నిరాడంబరంగా ఉందని ప్రశంసించారు. కొత్త ప్రాజెక్టులను ప్రకటించకుండా, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టడం శుభపరిణామమని పేర్కొన్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: