పేకాట, డైమండ్ డబ్బా, గుర్రపు రేస్ లు, సింగిల్ నెంబర్ లాటరీలు... ఇప్పుడు క్రికెట్ క్రీడను కూడా వీటి సరసన చేర్చవచ్చు. క్రికెట్ ను అందరూ ఒక క్రీడగా భావిస్తుంటే కొందరు మాత్రం దానిని జూదంగా మార్చారు. ఈరోజు క్రికెట్ అనేది ప్రపంచంలోనే ఓ పెద్ద మాఫియా జూదంగా మారింది.

క్రికెట్ పందేలు వందలకోట్లలో జరుగుతున్నాయి. అది టెస్ట్ అయినా వన్డే అయినా ట్వంటీ ట్వంటీ అయినా... అది ఐపిఎల్ అయినా, హీరో కప్ అయినా, ఐసిసి వరల్డ్ కప్ అయినా... పందేలా రాయుళ్లకు క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంటే వారికి పెద్ద పండుగ క్రిందే లెఖ్ఖ.

ప్రస్తుతం వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జరుగుతున్నాయి. పందేల రాయుళ్లకు సంక్రాంతి, దీపావళి కంటే ఇదే పెద్ద పండుగ. వెయ్యి దగ్గర నుండి కోట్లలో పందేలు. వరల్డ్ కప్ లోనే అత్యంత ఆసక్తికరమైన భారత్ – పాక్ మ్యాచ్ మీద కోట్ల రూపాయల పందేలు జరిగాయి. టాస్ దగ్గర నుండి పందేలు కాసారు. టాస్ ఎవరు గెలుస్తారు. మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనే అంశాల మీదే కాకుండా ఎవరు సెంచరీ కొడతారు, ఏ ఓవర్ లో ఎన్ని పరుగులు వస్తాయి. ఏ ఓవర్ లో వికెట్ పడుతుంది, ఎన్ని పరుగుల లోపు తేడాతో గెలుస్తారు... వంటి అనేక అంశాల మీద పందేలు జరిగాయి.

మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనే దానిమీదకంటే కూడా పందెంరాయుళ్లు చివరి బంతి లేదా చివరి వికెట్ వరకు వచ్చే పరుగులు మీద పందేలు కాయడం విశేషం. ఈ వరల్డ్ కప్ ముగిసేసరికి చాలామంది పందేల రాయుళ్లు ఆస్తులు అమ్ముకోవడం ఖాయం. గత వరల్డ్ కప్ అప్పుడు కూడా ఇలా పందేలు కాసి డబ్బులు పోగొట్టుకుని బ్రతుకుదెరువు కోసం బైక్ దొంగలుగా మారినవాళ్లు కూడా వున్నట్లు భోగట్టా...

మరింత సమాచారం తెలుసుకోండి: