పవన్ అంటే ఓ ప్రభంజనం... పవన్ అంటే ఓ ఉత్తేజం... పవన్ అంటే ఓ ఉద్రేకం... అన్యాయాన్ని ప్రశ్నిద్దాం అని ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చి నటుడిగా నే కాక ‘జనసేన’ అనే పార్టీనే స్థాపించి రాజీకీయ ప్రస్థానం మొదలు పెట్టిన పవన్ కళ్యాన్ ల్యాండ్ పులింగ్ పేరుతో అంత అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారు అని మంగళ గిరి మండలం బేతపూడి గ్రామ ప్రజలు, రైతులు ప్రశ్నిస్తున్నారు.

మెగా అభిమానమో పవర్ స్టార్ పై ఉన్న అభిమానమో కానీ ఆయన వచ్చి ప్రచారం చేసేటపుడు తమకు ఓ మంచి నాయకుడు వస్తున్నారని అశించం.. పవన మాటలపై నమ్మకం ఉంచాం ప్రశ్నించండి అనే నినాదంతో వస్తున్న పవన్ వెంట ఉన్నాం అందుకే ఆయన చెప్పి వారికే ఓటేసి గెలిపించాం అంటున్నారు అక్కడి ప్రజలు.

మాకు జరుగుతున్న అన్యాయానికి రొడ్డెక్కాల్సిన పరిస్థతి దాపురించిందని వాపోయారు. గతంలో తమ గ్రామానికి 450 ఎకరాలు ఉండేదని, 30ఏళ్ల కిందట ఉడా 250 ఎకరాలు తీసుకోవడంతో 200 ఎకరాలు మిగిలినట్లు చెప్పారు.

ఇప్పుడు ప్రభుత్వం తమ భూమి తీసుకుని ఏడాదికి రూ.30వేలు ఇస్తానంటోందని, అది ఏమూలకు సరిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తరఫున పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని మాకు తగిన న్యాయం జరిగేలా చూడాలని పవన్ అభిమానులు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: