ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటో నంబర్ హెచ్చరిక జారీ చేశాడు. రాజధాని వ్యవహారంలో తాము అనుసరించబోయే తీరును స్పష్టం చేశాడు. మర్యాదగా భూములు ఇస్తే పర్వాలేదు లేకపోతే.. స్వాధీనమేనని ఆయన స్పష్టత ఇచ్చాడు. ఈ మేరకు రైతులకు ఒక హెచ్చరికే చేశాడాయన. మీడియా సమావేశంలో ఇదే విషయాన్ని చెప్పిన బాబు తనను కలవడానికి వచ్చిన రైతులకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు.

రాజధాని భూ సేకరణ విషయంలో వెనక్కు తగ్గేది లేదనేది బాబు మాట. ఈ విషయంలో ఎవ్వరూ అభ్యంతరాలు చెప్పడానికి లేదని.. ఆయన స్పష్టం చేశాడు. ఎవరైనా అభ్యంతరాలు చెప్పి.. భూములు ఇవ్వమని అంటే తాము ఊరికే ఉండమని.. చట్టాన్ని ప్రయోగించి భూములను స్వాధీనం చేసుకొంటామని బాబు స్పష్టం చేయడం విశేషం.

మరి బాబు తీరు హెచ్చరించినట్టుగానే ఉంది. మర్యాదగా ఇస్తే ఇవ్వండి లేకపోతే స్వాధీనం చేసుకోవడమేనని ఆయన అంటున్నాడు. ఘాటుగా చెప్పకపోయినా.. సౌమ్యంగా చెబుతున్నా.. చట్టం అంటున్నా... బాబు మాటలు మాత్రం రైతులను హెచ్చరిస్తున్నట్టుగానే ఉన్నాయి. మరి ఈ మాటలను బట్టి ఒకటో నంబర్ హెచ్చరిక జారీ చేసేసినట్టే అనుకోవాలి.

ఇకపై భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. భూములను ఇవ్వడానికి నిరాకరిస్తున్న రైతులపై చట్ట ప్రయోగం ఉంటుందని బాబు స్వయంగా చెబుతున్నాడు కాబట్టి.. అలా స్వాధీనం చేసుకొనే ప్రక్రియ ఎలా ఉంటుంది? రైతులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందా?! అనేది వేచి చూసి తెలుసుకోవాలి!

మరింత సమాచారం తెలుసుకోండి: