భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీకి వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖులంతా. ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సహా ముఖ్యనేతలు అంతా అద్వానీని విష్ చేశారు. 50 వ వివాహ వార్షికోత్సవం జరుపుకొంటున్న ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలా శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖుల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఉన్నారు.

సోనియాగాంధీ అద్వానీకి లేఖ రాసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ లేఖలోసోనియాగాంధీ భావోద్వేగ భరితం కావడం విశేషం. అద్వానీకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సోనియా ఈ సందర్భంగా రాజీవ్ ను గుర్తు తెచ్చుకొందట. ఒకవేళ రాజీవ్ బతికి ఉంటే తాము కూడా ఇప్పుడు 47 వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొనే వాళ్లమని సోనియాగాంధీ అద్వానీకి చెప్పుకొన్నారు.

అయితే రాజీవ్ తనకు దూరం అయిపోవడంతో ఆ అవకాశం లేదని సోనియా బాధపడింది. మరి ఈ విషయంలో సోనియాగాంధీ పై అందరి సానుభూతీ ఉంటుంది. ప్రధానమంత్రి హోదాలో హత్యకు గురయ్యాడు రాజీవ్ గాంధీ. ఎల్టీటీఈ వాళ్లు రాజీవ్ ను హత్య చేశారు. దీంతో సోనియా భర్తను కోల్పోయింది.

భారత ప్రధానమంత్రిని చంపి తమ ఉనికిని చాటుకొనే యత్నంలో ఎల్టీటీఈ ఆ దుర్మార్గానికి ఒడికట్టింది. దీంతో ప్రధాని అనే హోదానే రాజీవ్ హత్యకు కారణమైంది. సోనియాగాంధీ బాధితురాలయ్యింది. ఈ లేటు వయసులో ఇప్పుడామె రాజీవ్ ను తలుచుకోవడం అర్థం చేసుకోదగిన అంశమే. కాబట్టి ఆమె కు సానుభూతిని ప్రకటించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకొన్న అద్వానీ కూడా తనకు సోనియాకు వెంటనే ఫోన్ చేశారట. తనకు శుభకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు.. ఆమెను ఊరటినిచ్చేలా మట్లాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: