ఇన్ కం ట్యాక్స్ మినహాయింపు పరిమితి…3 లక్షలా…? లేదంటే ఏకంగా 5 లక్షలా..? అసలు ట్యాక్స్ లిమిట్ ను పెంచితే ఎవరికి ఎంత లాభమనే లెక్కలేసుకుంటున్నారు వేతన జీవులు. ప్రస్తుతం ఉన్న సాలరీస్ ను లెక్కలోకి తీసుకుంటే జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి కూడా ఆదాయం పన్ను పరిధిలోకి వస్తున్నారు. ఇక పదేళ్ల సర్వీసు దాటిన గెజిటెడ్ ఎంప్లాయిస్ పరిస్థితి చెప్పనక్కరలేదు. ప్రస్తుతమున్న ఇన్ కం ట్యాక్స్ స్లాబ్ ల ప్రకారం టాక్స్ బుల్ ఇన్ కంలో కనీసం 10 పర్సంట్ ఇన్ కం ట్యాక్స్ రూపంలో చెల్లించాల్సి వస్తోంది.

ప్రస్తుతం ఇన్ కం ట్యాక్స్ స్లాబ్ లను చూస్తే 60 ఏళ్ల వయసు లోపు ఉన్న వారి ఆదాయం గతంలో 2 లక్షల లోపు ఉంటే ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే గత బడ్జెట్లో ఈ పరిమితిని రెండున్నర లక్షలకు పెంచారు. అంటే రెండున్నర లక్షల లోపు ఆదాయం ఉన్న వారు ఇన్ కం ట్యాక్ చెల్లించాల్సిన అవసరం లేదు. రెండున్నర లక్షల నుంచి 5 లక్షల లోపు ఆదాయం ఉంటే 10 శాతం ట్యాక్స్ చెల్లించాలి. 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఆదాయం ఉంటే 20 శాతం పన్ను ….10 లక్షలకు పైగా ఆదాయం ఉంటే 30 శాతం ఇన్ కం ట్యాక్స్ రూపంలో చెల్లించాలి. 60 ఏళ్ల నుంచి 80 ఏళ్ల వయసు లోపు ఉన్న వారిని సీనియర్ సిటిజన్ గా పరిగణిస్తున్నారు.. ప్రస్తుత బడ్జెట్లో ప్రతిపాదనల ప్రకారం 3 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు ఎలాంటి పన్ను చెల్లించనవసరం లేదు. 3 నుంచి 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు 10 శాతం పన్ను చెల్లించాలి. 5 లక్షల నుంచి 10 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు 20 శాతం 10 లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారు 30 శాతం టాక్స్ చెల్లించాలి. ఆదాయం పన్ను పరిమితిని మించిన వారు ఇన్ కం ట్యాక్స్ చట్టం ప్రకారం కొన్ని మినహాయింపులు పొందే చాన్స్ ఉంది. ఇలా మినహాయింపు పొందే సెక్షన్లలో 80 సి ముఖ్యమైంది. ఇప్పటి వరకు ఈ సెక్షన్ కింద గరిష్ఠంగా లక్ష రూపాయల వరకు మినహాయింపు ఉండేది. దీన్ని గత మధ్యంతర బడ్జెట్లో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లక్షన్నర వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 2009 తర్వాత ఆదాయపు పన్ను మినహాయింపులో పెద్దగా చెప్పుకోదగిన మార్పులేమీ లేవు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ లో ఆర్ధికమంత్రి ఆదాయం పన్ను పరిమితిని పెంచవచ్చన్న సంకేతాలున్నాయి. ప్రస్తుతం 2.5 లక్షలున్న నో ట్యాక్స్ స్లాబును 5 లక్షలకు పెంచే చాన్స్ ఉంది. ఇదే జరిగితే నెలకు 40వేలు జీతం తీసుకుంటున్న వారు కూడా ట్యాక్స్ పరిధిలోకి రారు. అటు రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల లోపు ఉన్న 10 శాతం ట్యాక్స్ స్లాబ్ ను 5 నుంచి 10 లక్షలకు,10 లక్షల నుంచి 20 లక్షల ఆదాయంపై 20 శాతం ఆపై ఆదాయం ఉన్నవారినుంచి 30 శాతం పన్ను వసూలు చేయాలన్న సూచనలు చాలానే ఆర్ధిక శాఖకు వచ్చాయి. వీటన్నింటిని ఆర్థికమంత్రి తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు టాక్. ఇన్ కంట్యాక్స్ మినహాయింపు పరిమితిని 5 లక్షల వరకూ పెంచితే డైరెక్ట్ ట్యాక్స్ వసూళ్లు ఏ మేరకు తగ్గుతాయన్న దానిపై ఓ నివేదిక ఇవ్వాలని ఆదాయ పన్ను శాఖను కోరింది ఆర్థిక శాఖ. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం 5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారు ఇన్ కం ట్యాక్స్ కట్టనవసరం లేదంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. 2009 తర్వాత ప్రజల ఆదాయాలు కూడా భారీగా పెరిగాయి. హైఎండ్ లో నెలకు లక్ష రూపాయిల జీతం తీసుకోవడం కామన్ అయిపోగా… దిగువస్థాయిలో 10 నుంచి 30 వేల రూపాయిల జీతం చాలా కామన్ అయింది. ఈ నేపథ్యంలో పన్ను స్లాబ్ ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల నుంచి 5 లక్షల రూపాయిలకు పెరగాల్సిన అవసరం ఉందన్నది అందరి వాదన. అయితే ప్రస్తుతం ఉన్న బేసిక్ లిమిట్స్ 3 లక్షలకు పెంచితేనే కేంధ్ర ప్రభుత్వం 60,000 కోట్ల రూపాయిల ఆదాయం కోల్పోవలసి వస్తోంది. అదే 5 లక్షలకు పెంచితే సుమారు లక్షన్నర కోట్ల రూపాయిల ఆదాయాన్ని కేంధ్రం వదులుకోవాల్సి వస్తుంది. ప్రజెంట్ సిచ్చువేషన్ లో ఇంత ఆర్థిక నష్టాన్ని ప్రభుత్వం భరించలేదనేది విశ్లేషకుల వాదన. కోటి రూపాయిల ఆదాయం ఉన్న వారి దగ్గర నుంచి ఎక్కువ పన్ను వసూలు చేస్తే 3 లక్షల మినహాయింపు సునాయాసంగా ఇవ్వచ్చనే సూచనలను ఆర్థికమంత్రి పరిశీలిస్తున్నట్లు సమాచారం.

అటు పన్ను రాయితీల పరిధిని కూడా పెంచాలనే సూచనలూ వస్తున్నాయి. 80 సీ కింద గత బడ్జెట్లో డిడెక్షన్ లిమిట్ ను లక్ష నుంచి లక్షన్నరకు పెంచారు. దీన్ని ఈ సారి రెండున్నర లక్షలకు పెంచితే జాతీయ స్థాయిలో సేవింగ్స్ బాగా పెరిగే చాన్స్ ఉంది. దీన్ని కేంద్రం పరిగణలోకి తీసుకునే అవకాశముంది. మరోవైపు పెరుగుతున్న వైద్య ఖర్చులు దృష్టిలో పెట్టుకుని మెడికల్ రీఎంబర్స్ మెంట్ ను 15 వేల నుంచి 50 వేల రూపాయలకు పెంచాలన్న డిమాండ్ అన్ని కేటగిరీల సాలరీడ్ క్లాస్ నుంచి వస్తోంది.

ఇదే కాక 1998లో ప్రవేశపెట్టిన ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ ఎంగ్జప్షన్ 8 వందల రూపాయలను ప్రస్తుతం 4 వేల రూపాయలకు పెంచితే పెరిగిన ట్రాన్స్ పోర్ట్ ఖర్చులకు సరిపోతుందని సూచిస్తున్నారు ఉద్యోగులు. దీంతో పాటు ఇన్ కం ట్యాక్స్ రాయియితీ ల కోసం చేసిన ఫిక్స్ డ్ డిపాజిట్ల ఐదేళ్ల పీరియడ్ ను మూడేళ్లు తగ్గించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. మొదటి సారిగా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్న అరుణ్ జైట్లీపై వేతన జీవులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ ఎక్స్ పెక్టేషన్స్ అన్నింటినీ రీచయ్యేందుకు ఆర్థికమంత్రి భారీ కసరత్తే చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: