వెర్రి వేయి రకాలు.. ఎవరి పిచ్చి వారికి ఆనందం అంటారు పెద్దలు. సిగ్గూ బిడియం లేకుండా ఒంటిపై ఒక్క నూలు పోగు లేకుండా నగ్నాంగా తిరుగుతూ అందరినీ విస్మయానికి గురిచేసి సంఘటన బెర్లిన్ లో ఓ మ్యూజియంలో జరిగింది.

బెర్లిన్ లో ఓ ఫోటో ప్రదర్శన జరుగుతుంది అందరూ ఆసక్తిగా ఆ ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్నారు. హటాత్తుగా ఒక పాపను ఎత్తుకొని యువతి అక్కడి వచ్చింది. తీరా చూస్తే అమ్మడి ఒంటిపై ఒక్క నూలు పోగు కూడా లేదు పూర్తి నగ్నంగా ఉంది. అయినా కూడా మామూలుగా ఫోటో ప్రదర్శనను తిలకిస్తుంది.

గ్యాలరీ మొత్తం కలియ తిరుగుతుంది. పక్కన ఎవరు ఉన్నారూ లేదా అని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ తిరుగుతుంది. ఆమెను చూసిన ఆడవాళ్లు ముక్కుమీద వేలేసుకున్నారు.

మగవాళ్లయితే ఒక్కసారి ఆశ్చర్యపోయి కళ్లు పెద్దగా చేసుకొని చూస్తూ ఉండిపోయారు. అంతలోనే తేరుకొని కొందరు అక్కడి సిబ్బందికి కాంప్లెంట్ చేయడంతో అమ్మడికి బట్టలు తొడిగించి బయలకు పంపించి వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: