మొత్తానికి రాహుల్ గాంధీ అందరికీ లోకువ అయిపోయినట్టున్నాడు. దేశంలోని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అధ్యక్ష పీఠాన్ని చేపట్టడానికి రెడీగా ఉన్న దశలో ఆయన వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదం అవుతోంది. దీన్ని ఆధారంగా చేసుకొని కొంతమంది రాహుల్ పై విరుచుకుపడుతుంటే.. మరికొందరు రాహుల్ తో కామెడీ చేస్తున్నారు.

లోక్ సభ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఉత్తరాఖండ్ కు విహారయాత్రకు పోయినట్టుగా వార్తలొస్తున్నాయి. సభకు అయితే రెండు వారాల పాటు రాలేనని లేఖ పెట్టుకొన్న రాహుల్ గాంధీ... ఉత్తరాఖండ్ లో ఉన్నాడని కూడా ష్యూరిటీ లేదు. మీడియాలో అయితే అలాంటి కథనాలు వచ్చాయంతే.

మరి బాధ్యతాయుతమైన ప్రతిపక్షంలో కీలక నేతగా ఉండి రాహుల్ గాంధీ ఇలాంటి బడ్జెట్ సమావేశాల సమయంలో విహార యాత్రకు వెళ్లడం కచ్చితంగా విడ్డూరమే. ఈ నేపథ్యంలో రాహుల్ ఆచూకీ తెలపాలంటే.. కోర్టులో ఒక పిల్ పడటం ఆసక్తికరంగా ఉంది. రాహుల్ ఒక ఎంపీ, ఒక పార్టీ ఉపాధ్యక్షుడు.. కాబట్టి ఆయన రక్షణ ను ఉద్దేశించి ఈ పిటిషన్ ను వేస్తున్నట్టుగా పిల్ లో పేర్కొన్నారు.

మరి పిటిషనర్ రాహుల్ భద్రతను ఉద్దేశించి పిటిషన్ వేస్తున్నట్టుగా చెప్పినప్పటికీ..ఈ పిటిషన్ రాహుల్ తీరుపై వ్యంగ్యాస్త్రంలా ఉంది. ఆయన తీరుకు దెప్పి పొడవడానికి ఇంతకన్నా వేరే అస్త్రం కూడా అవసరం లేదు. మరి రాహుల్ కు ఈ తీవ్రత అర్థం అయ్యిందో లేదో ఆనీ.. కాంగ్రెస్ నేతలు మాత్రం తమ యువరాజు తీరుతో తలెత్తుకోలేకపోతున్నారనేది నిజం!

మరింత సమాచారం తెలుసుకోండి: