ఈరోజు ఉదయం అందరి ఊహలను తారుమారు చేస్తూ పవన్ చంద్రబాబుల భేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలన వార్తగా మారింది. ఈ సమావేశం ఎదో యధాలాపంగా జరిగింది కాదని దీని వెనుక పెద్ద వ్యూహమే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరి సమావేశానికి ఒక రాష్ట్ర మంత్రి సమన్వయ కర్తగా వ్యవహరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్, చంద్రబాబుల సమావేశం దాదాపు గంటన్నర పైన జరిగిందని టాక్. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్‌ కు జరిగిన అన్యాయం నుంచి కొత్త రాజధాని విషయమై రైతులు చేపడుతున్న ఉద్యమాల వరకు అనేక విషయాలు చంద్రబాబు, పవన్ ల సమావేశంలో కీలక అంశాలుగా చర్చలు జరిగాయని టాక్.

ప్రతి విషయాన్ని చంద్రబాబునాయుడు పవన్ కు విడమరచి చెప్పడమే కాకుండా పవన్ లేవనెత్తిన అనేక సందేహాలకు సమాధానాలు ఇచ్చి సంతృప్తి పరిచినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చర్చలలో వీరిద్దరూ కేంద్ర ప్రభుత్వం పై ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయo విషయంలో ఎటువంటి ఒత్తిడి కేంద్ర పభుత్వం పై తీసుకు రావాలి అన్న విషయం పై ఒక స్పష్టమైన అవగాహానకు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

అంతేకాదు త్వరలోనే పవన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవ బోతున్నట్లు తన అభిప్రాయాన్ని చంద్రబాబునాయుడుకు తెలిపాడు అని కూడా తెలుస్తోంది అయితే పవన్ ఒక్కడే ప్రధానమంత్రిని కలుస్తాడా? లేదంటే ఈ వ్యూహంలో చంద్రబాబును కూడ కలుపుకుని వెళతాడా? అన్న విషయం పై రానున్న రోజులలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: