అవును చంద్రబాబు సర్కారు మరో ప్రపంచ రికార్డు సాధించింది. ఏ విషయంలో అనుకుంటున్నారా.. ఇప్పుడు ఆంధ్రాలో హాట్ టాపిక్ అయిన రాజధాని విషయంలోనే. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆంధ్రాలో ఉన్న రియల్ ఎస్టేట్ ధరల దృష్ట్యా చంద్రబాబు ప్రభుత్వం భూములను డబ్బుతో కొనే పరిస్థితి లేదు.

అసలే విభజన కష్టాలతో ఉన్న బాబు టీమ్.. భూసేకరణ కోసం నిధులు వెచ్చించే సీన్ లేదు. అందుకే చంద్రబాబు కొత్తగా ల్యాండ్ పూలింగ్ అనే విధానానికి తెరతీశారు. రైతుల నుంచి భూములు తీసుకుని.. వాటిని డెవలప్ చేసి.. అందులో కొంత భాగాన్ని రైతులకు ఇవ్వడం మిగిలింది.. ప్రభుత్వం తీసుకోవడం.. ఈ కాన్సెప్ట్ ముఖ్యోద్దేశం.

రైతు నుంచి భూమిని వేరు చేయడం అంత సులభం కాదు. అలాంటిది ఏకంగా 32 వేల ఎకరాల్లో రైతుల నుంచి చంద్రబాబు టీమ్ సమ్మతి పత్రాలు తీసుకుంది. అది కూడా పెద్దగా ఎలాంటి వివాదాలు, గొడవలు జరగకుండానే. అందుకే రాజధాని రైతుల త్యాగాలను బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావింపజేయాలని టీడీపీ సర్కారు నిర్ణయించింది.

ఇంత పెద్దసంఖ్యలో భూములు సేకరించడం ఓ ప్రంపచ రికార్డేనట.. సాక్షాత్తూ ఏపీ మంత్రి నారాయణే ఈ విషయం సెలవిచ్చారు. ఇంత ఎక్కువ భూమి.. ఇంత తక్కువ సమయంలో ప్రపంచంలో ఎక్కడా సేకరించినట్టు చరిత్రలో లేదని ఆయన తేల్చిచెప్పారు. ఏదేమైనా.. పైసా ఖర్చు పెట్టకుండానే చంద్రబాబు సర్కారు.. ఇన్ని వేల ఎకరాలభూమిని ప్రభుత్వం కోసం సమీకరించడం నిజంగా గ్రేటే.. కాదంటారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: