ఉందో లేదో తెలియన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్, తెలుగుదేశం అధినేత ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుల మీటింగ్ కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చేశాడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు. ఒకవైపు ఈ భేటీ గురించి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న తరుణంలో వెంకయ్యనాయుడు ఇలా మాట్లాడటం నిజంగా ఆసక్తికరమైన అంశమే!

అసలు పవన్, చంద్రబాబు లు ఎవరో కాదు.. భారతీయ జనతా పార్టీకి బాగా కావాల్సిన వాళ్లు. ఎన్నికల సమయంలో కమలనాథులు, పవన్ కల్యాణ్ , చంద్రబాబులు కలిసి పనిచేశారు. ఒకరి గెలుపుకోసం మరొకరు ప్రచారం చేసుకొన్నారు. అందరూ కలిసి విజయాన్ని సొంతం చేసుకొన్నారు. మరి అప్పుడు అంత దగ్గరవారిగా... ఆప్తులు కనిపించిన వారి గురించి ఇప్పుడు వెంకయ్య ఇలా తేల్చేశారు.

వారి భేటీకి ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరమే లేదని స్పష్టం చేశాడు. ఇలాంటి మార్పు ఆసక్తికరమైన అంశమే. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం.. పవన్ కూడా ఇలాంటి అభిప్రాయంతోనే ఉండటం.. వారిద్దరూ సమావేశం కావడం.. భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించడం జరిగింది.

ఇలాంటి నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో వారి భేటీ చర్చనీయాంశం అయ్యింది. భారతీయ జనతా పార్టీకి సన్నిహితులైన వాళ్లు ఇప్పుడేం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. మరి ఇప్పుడు మాత్రం వెంకయ్య వారిని లైట్ తీసుకోవాలని.. వారి భేటీకి ప్రాధాన్యతను ఇవ్వాల్సిన అవసరం లేదని అనడం విశేషమే కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: