ఏపీకి కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేస్తోందని అంటున్నారు తెలుగుదేశం నేతలు... ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశాడు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశాడు. ఒకవైపు తమకు బీజేపీతో రాజకీయ విబేధాలు లేవంటూనే బాబు అసంతృప్తి వ్యక్తం చేశాడు.

మరి బాబు ఆవేదన సంగతి అలా ఉంటే.. మిగిలిన తెలుగుదేశం నేతలుకూడా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోడీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేసిందని అన్నారు. రైల్వే బడ్జెట్ లోనూ... యూనియన్ బడ్జెట్ లోనూ కేంద్ర ప్రభుత్వం ఒకే విధంగా అన్యాయం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎంపీ అయితే మరో అడుగు ముందుకేసి బాబు సమ్మతిస్తే భారతీయ జనతా పార్టీ పై పోరాడతామని అన్నాడు.

ఇక ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ తమకు మిత్రపక్షమో.. ప్రతిపక్షమో అర్థం కావడం లేదని అంటున్నారు. రైల్వే బడ్జెట్ లోనూ.. యూనియన్ బడ్జెట్ లోనూ ఏపీకి ఒక విధమైన అన్యాయం జరిగిందని ఆయన ఆవేధన వ్యక్తం చేశాడు.

మరి ఈ విమర్శలు.. ఆవేదనలు.. ఆందోళనలూ వ్యక్తం చేయడం తో వచ్చే లాభం ఏమీ ఉండదు. చంద్రబాబు పార్టీ కఠిన మైన నిర్ణయాలు తీసుకొంటే అంతో ఇంతో లాభం ఉంటుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకోవడం.. ఎన్టీయే నుంచి వైదొలగడం వంటి తీవ్ర నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. మరి వీళ్లకు అంత ధైర్యం ఉందా?! అనేది అనుమానాస్పదమైన విషయమే. మరేం జరుగుతుందో!

మరింత సమాచారం తెలుసుకోండి: