రాజదాని ప్రతిపాదిత ప్రాంతంలో పవన్ కల్యాణ్ పర్యటిస్తే పరిస్థితి ఏమిటి? అయన అక్కడ రైతులతో ఏం మాట్లాడతారు? తమ భూములను స్వాదీనం చేసుకొంటున్న ప్రభుత్వంపై ఆగ్రహంతో.. తమ పరిస్థితి గురించి ఆవేదన గురించి వారు వివరిస్తే.. పవన్ ఎలా స్పందిస్తాడు?! పంట భూములను ప్రభుత్వం అక్రమంగా స్వాధీనం చేసుకొంటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తే పవన్ ఎలా దైర్యం చెబుతాడు? అనే పాయింట్లు ఇప్పుడు ఆసక్తికరంగా ఉన్నాయి.

జగన్ కన్నా ముందుగానే రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో పవన్ టూర్ షెడ్యూల్ అయ్యింది .అయితే .. అనుకోకుండా అది వాయిదాపడింది. ఐదో తేదీన పవన్ సీఆర్ డీఏ పరిధిలో పర్యటిస్తాడట! ఆ ప్రాంతంలో పవన్ ప్రశ్నించడం లేదంటూ ఫ్లెక్సీలు దర్శనమిచ్చే సరికి పవన్ ఇప్పుడు తప్పనిసరిగా స్పందిస్తున్నాడు. అక్కడిరైతులను కలవడానికి వెళుతున్నాడు.

మరి రైతుల్లో చాలా మంది భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఈ విషయంలో వారు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అయితే... ప్రభుత్వం మాత్రం ఆల్ ఈజ్ వెల్ అంటోంది. రైతులు ఆనందంగా భూమలు అప్పగిస్తున్నారని స్పష్టం చేస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పవన్ అక్కడ అడుగుపెడుతున్నాడు.

మరి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తే.. వారిని భూములు అప్పగించే పని నుంచి మినహాయించాలని పవన్ అంటాడా? ఒకవేళ అలా అంటే.. తెలుగుదేశంప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజధాని అంవానికి పవన్ అడ్డుపడ్డట్టే అవుతుంది. అప్పడు తెలుగుదేశం ఎలా స్పందిస్తుందనేదీ ఆసక్తికరమైన అంశమే!

మరింత సమాచారం తెలుసుకోండి: