జార్కండ్ డైమెండ్ ధనాధన్ దోనీ అంటే టీమిండియా నాయకుడిగా అందరినీ ఒకే తాటిమీదకు తీసుకు వచ్చి వారిలో ఉత్తేజాన్ని నింపుతూ విజయవంతంగా టీమ్ ఇండియాను ముందుకు తీసుకు వెళ్తున్నాడు. మహేంద్ర సింగ్ ధోని ముద్దుల కూతురు 'జివా'కి సంబంధించిన తొలి ఫోటో సోషల్ మీడియాలో హాల్‌చల్ సృష్టిస్తోంది. పాప పుట్టినప్పటి నుంచి తనకు అంతా కలిసి వస్తుందని దోనీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

పాప పుట్టినప్పటి నుంచి ధోని భార్య సాక్షి సింగ్ తన ముద్దుల కూతురితో పిచ్చి టైంపాస్ అవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా హ్యట్రిక్ చేసిన విషయం తెలిసిందే. తన భర్త టీమ్ ఇండియా నాయకుడిగా ముందుకు సాగడం సాక్షికి ఎత్తో ఉత్సాహంగా ఉంది. పాప పుట్టిన అదృష్టంగా బావిస్తూ ముందు ముందు కూడా విజయాలు సాధించాలని కోరుకుంటుంది.

ఈ విషయాలు అన్ని తన ట్విట్టర్ ద్వారా ఈ చిత్రాన్ని ట్వీట్ చేసింది. గుర్గావ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఫిబ్రవరి 6 శుక్రవారం నాడు ధోని భార్య ఓ బేబీ గర్ల్‌కి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కెప్టెన్ ధోని ఐసీసీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఆడేందుకు ఆస్టేలియాకి వెళ్లిన విషయం తెలిసిందే.

మార్చి 2న ధోని భార్య సాక్షి సింగ్ తన మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో తన ముద్దుల కూతురు 'జివా' ఫోటోను ట్వీట్ చేసింది. ఈ ఫోటోలో చిన్నారి జీవా, అమ్మ చేతిని మృదువుగా పట్టుకుని ఉంది. ఈ ఫోటో కింద ధోని భార్య Bundle of Joy అని రాసింది. జీవా అనేది పర్షియన్ భాషకు చెందిన పదం. ఈ పదానికి అర్థం అందం

మరింత సమాచారం తెలుసుకోండి: