వివాహమైన అనంతరం భార్యా భర్తల మధ్య కాస్త సిగ్గూ బిడియం వంటివి చోటు చేసుకుంటుంది. ఒక వేళ ప్రేమ వివాహమైతే ఇరువురి మధ్య కాస్తే చనువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారి దాంపత్యం చాలా ఫ్రీగా ఉంటుంది. కొత్తగా పెళ్లయిన జంటకు పరిచయాలు తక్కువే కాబట్టి కొంచెం చనువు వచ్చే వరకు సాధారణ శృంగారం లో పాల్గొనవచ్చు.

ఇరువురికి ఇష్టమై రతి చేసేటపుడు ఏ భంగిమ అత్యుత్తమమైనది అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే, ఇదే అంశంపై నిపుణులను సంప్రదిస్తే వారు చెపుతున్న సమాధానం ఒక్కటే. రతి క్రీడలో ఇద్దరికీ నచ్చిన భంగిమే అత్యుత్తమ భంగిమ అని అంటున్నారు.

భార్యా భర్తలకు అసౌకర్యాన్ని సంకేతరూపంలో వ్యక్తపర్చడం జరుగుతుంది. పారవశ్యానుభూతి తగ్గటం, మైధున వేగం తగ్గిపోవడం, స్త్రీ అయితే పురుషున్ని బలవంతంగా నెట్టి వేయడం వంటి చర్యల ద్వారా అసౌకర్యం వ్యక్తమవుతుంది. ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని మరొక భంగిమను ఎంచుకునేందుకు ఆసక్తి చూపాలంటున్నారు.

భార్యాభర్తల మధ్య రతి క్రీడ సజావుగా సాగేందుకు స్త్రీపురుషుని మనస్సులతో పాటు వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి. శారీరకంగా సౌకర్యంగా ఉండాలి. స్త్రీ పురుషులలో ఒకరికి ఒక భంగిమ చాలా అనుకూలమైనదిగా అనిపించవచ్చు. అదే భంగిమ మరొకరికి, కొంతసేపు రతిని సాగించాక అసౌకర్యంగా అనిపించవచ్చు. అప్పు వెంటనే విరమించుకోకుండా ప్రశాంతంగా ప్రేమతో వ్యవహరించుకోవాలి. ఈ రకంగా దాంపత్య జీవితం సజావుగా సాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: