కొత్త పరిశ్రమల స్థాపన కోసం ఎపి, తెలంగాణ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి.ఎపిలో పది లక్షల ఎకరాల బూమి బ్యాంకును ఏర్పాటు చేస్తామని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.కాగా తెలంగాణలో రెండు లక్షల ఎకరాల భూమి పరిశ్రమలకు ఇవ్వడానికి సిద్దం చేసినట్లు అదికారులు చెబుతున్నారు.

అయితే ఇందులో తక్షణమే ఇవ్వడానికి అనువుగా ఉన్న భూమి సుమారు 64 వేల ఎకరాలుగా గుర్తించారు. మిగిలిన భూమిలో కొండలు,గుట్టలు తదితర అంత అనువుకాని భూములు ఉన్నాయి. వీటిని పరిశ్రమలకు అనువుగా సిద్దం చేయడానికి కొంత టైమ్ పట్టవచ్చు.

మొత్తం రెండు లక్షల ఎకరాలలో హైదరాబాద్ మినహా అన్ని జిల్లాలలో ఈ భూమి విస్తరించి ఉంది.కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా ఏభై ఐదు వేల ఎకరాలు అందుబాటులో ఉంది. .................................

ఈ భూములలో పరిశ్రమలు పెట్టదలచినవారు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి జూపల్లె కృష్ణారావు చెబుతున్నారు.భూముల నిబంధనలను కూడా కొంత సడలిస్తామని ఆయన అన్నారు..................

మరింత సమాచారం తెలుసుకోండి: