ఇప్పుడు ఆంధ్రాలో రాజధాని పర్యటనలు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు సర్కారు 3వేల 2వందల ఎకరాలు విజయవంతంగా భూసమీకరణ చేసిన నేపథ్యంలో.. ఆ ప్రాంతంలో నేతల పర్యటనలు ఆసక్తికరంగా మారాయి. జగన్ ఇప్పటికే రాజధాని ప్రాంతంలో పర్యటిస్తుంటే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా త్వరలోనే రాజధాని బాట పట్టనున్నాడు..

ఈ పర్యటన నేపథ్యంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతల మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో పవన్, జగన్ ఇద్దరూ పర్యటిస్తూనే ఉన్నా.. పవన్ హీరో అని.. జగన్ విలన్ అని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే.. జగన్ మాత్రం ఎప్పటికీ విలనే అని ఆయన కామెంట్ చేశారు.

పవన్, జగన్ లను నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని సోమిరెడ్డి కామెంట్ చేశారు. రాజధాని ప్రాంతంలో జగన్ తన పర్యటనలో అన్నీ అసత్యాలు, అభూత కల్పనలు చెబుతున్నాడని సోమిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం రెండు, మూడేళ్లలో పడిపోతుందని జగన్ కామెంట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం కూలిపోవడం కాదని.. జగనే జైల్లో పడతారని ఆయన సెటైర్ వేశారు.

వైఎస్ హయాంలో వాన్ పిక్ సెక్ ఒక్కదాని కోసమే దాదాపు 30 వేల ఎకరాలు కేటాయిస్తే జగన్ ఆనాడు ఎందుకు నోరుమెదపలేదని సోమిరెడ్డి ప్రశ్నించారు. ఒక్క సెజ్ కోసం 30వేల ఎకరాలిస్తే నోరు మెదపని జగన్.. మొత్తం రాజధాని కోసం 32వేల ఎకరాలు సేకరిస్తే.. రోడ్డున పడి యాగీ చేస్తున్నాడని విమర్శించారు. రాజధాని అభివృద్ధి కోసం చంద్రబాబు రేయింబగళ్లు కష్టపడి పనిచేస్తుంటే.. జగన్ అడ్డుపడుతున్నారని సోమిరెడ్డి విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: